Headlines

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన గర్వపడేలా ముందుకుసాగుతోంది -ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం, అక్టోబర్ 5:

బుధవారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలో శ్రీశ్రీశ్రీ బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో ‘” సుపరి పాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం ” అనే అంశంపై ఉప ముఖ్యమంత్రి తనయుడు కొట్టు విశాల్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఉపముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు. సత్యనారాయణ, సంస్కృతి మరియు తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి, ఏపి అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎం వి ఎస్ నాగిరెడ్డి, ఏపి గ్రంథాలయ కమిటీ చైర్మన్ మండపాటి శేషగిరిరావు కలసి ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఏపి ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనన్నారు. ఇవ్వని హామీలు కూడా నెరవేర్చి ముందుకు సాగుతున్నారన్నారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు వ్యవస్థను ఏర్పాటు చేయడం సాధ్యమేనా అని మీతోపాటు తాను కూడా గత ఎన్నికల ముందు అనుకున్నానన్నారు.అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేసి అనుమానాలను పటాపంచలు చేసి చూపించారన్నారు. మనబడి నాడు – నేడు క్రింద పాఠశాలలను అభివృద్ధి చేయడం, సచివాల యాలను నిర్మించడం, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లను, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను నిర్మించడం అభివృద్ధిలో భాగం కాదా అని ఆయన అన్నారు. తీర ప్రాంతాల్లో నాలుగు పోర్టులు,9 ఫిషింగ్‌ హార్బర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రికి మాత్రమే వచ్చిందన్నారు.17 మెడికల్ కాలేజి ఏర్పాటు సామాన్య మైన విషయం కాదన్నారు. వైజాగ్‌లో 15 వేల మందికి ఉపాధి కల్పించేందుకు డాటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నా రన్నారు.ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాద్యమం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆయన తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను గుర్తించిన సీఎం జగన్‌ సుపరిపాలన సాగిస్తున్నారన్నారు. వాహన మిత్ర, రైతు భరోసా, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సురక్ష వివిధ, 104 ,108 అంబులెన్సు సేవలు, వివిధ రకాల పెన్షన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఎన్నెన్నో పథకాలు ఉన్నాయని ఏపి ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు.
ఉపముఖ్యమంత్రి,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అభివృధ్ది, సంక్షేమానికి చిరునామా వైయస్ కుటుంబాలని పేద ప్రజలు బాధలు బాగా అధ్యయనం చేశారన్నారు. విద్య,ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం ఈ నాలుగు అంశాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. మనబడి నాడు – నేడు క్రింద పాఠశాలలు సరస్వతి దేవాలయాలుగా మారాయన్నారు. మేము చదువు కునే రోజుల్లో మా పాఠశాలలు ఒక సారి ఊహించు కుంటే ఎంతో భాద కలుగు తుందన్నారు. ప్రతి పక్షాలు కేవలం ఉనికి కోసమే ఆరాట పడుతున్నారని, కొన్ని పత్రికలు విష ప్రచారాలు చేస్తున్నాయని వీటిని త్రిప్పి కొట్టాలన్నారు. సచివాల యాలు, గ్రామ వాలంటీర్లు వ్యవస్థ తీసుకు వచ్చి వినూత్న పాలనకు శ్రీకారం చుట్టి అందరి మన్ననలు పొందారని ఆయన అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రంలో పర్యటించి సచివాలయం పనితీరును అధ్యయనం చేస్తున్నారని వారి రాష్ట్రంలో అమలు చేసుకునుటకు ముందుకు వెళుతున్నారని ఆయన అన్నారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని ఎంతో మంచి ఆలోచనలు చేస్తున్నారని మంచి మనస్సు ఉన్న ముఖ్యమంత్రి దొరుకుట మన అందరి అదృష్టం అని రాష్ట్ర ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు. సత్యనారాయణ అన్నారు.
తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ అతి చిన్న వయస్సులో మన ముఖ్యమంత్రి అందరికీ సమ న్యాయం, సమపాలన అందజేసి అందరీ మన్ననలు పొందారని ఆమె అన్నారు.అభివృధ్ది ,సంక్షేమం రెండు కళ్ళులా చూసుకుని ముందుకు సాగుతున్నారని ఆమె అన్నారు . విద్య,ఆరోగ్యం ,అభివృధ్ది ఉంటే నవసమాజం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి ఆలోచన అని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు హౌస్ ఫుల్ గా నడుస్తున్నాయని, ప్రవేటు పాఠ శాలలు మించి మంచి సౌకర్యాలు ఉన్నాయని ఆమె అన్నారు.దేశంలో అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు బేరీజు వేసుకుంటున్నారని ఆమె అన్నారు.కరోనా కష్ట కాలంలో మన రాష్ట్రం తీసుకున్న చర్యలు చాలా అమోఘం అని ,తక్కువ ప్రాణ నష్టం తో బయట పడ్డాము అంటే ముఖ్య మంత్రి తీసుకున్న మంచి చర్యలు మనకు ఊపిరి పోసాయని అమె అన్నారు. నవరత్నాలు పథకాలు 9 పథకాలు అని కాని జరిగిన పథకాలు ఎన్నో రత్నాలు అని అవి లెక్కపెట్ట లేనివి అని అమె అన్నారు. ప్రతి ఇంటికి మంచి స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారని వైద్య సేవలు ఇంటికి తీసుకు వచ్చి అందరికీ ఆరోగ్యం ఉండాలని మంచి మనస్సు ఉన్న మంచి ముఖ్యమంత్రి ఉండుట మన అందరి అదృష్టం అన్నారు. యువతకు మంచి చదువులు, మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచన చేస్తున్న మన ముఖ్యమంత్రి కి బాసటగా నిలవాలని శ్రీమతి నందమూరి లక్ష్మీ కోరారు.
ఏపి అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ యంవియస్ నాగిరెడ్డి మాట్లాడుతూ రైతులకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత వైయస్ కుటుంబాలకు దక్కు తుందని ఆయన అన్నారు. డాక్టరు వైయస్సార్ అనాడు ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలు హృదయాల్లో చెరగని ముద్ర వేసాయన్నారు. తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకు వేసి నవ రత్నాలు పథకాలు ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నాయని, ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు నేరవెర్చి ప్రజలు మనన్నలు పొందుతు న్నారని ఆయన అన్నారు.రాష్ట్రంలో 32 లక్షలు నిరుపేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత ముఖ్య మంత్రి కి దక్కుతుందని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని ఇండ్ల నిర్మాణాలు జరగలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలో అభివృధ్ది , సంక్షేమం కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నాయన్నారు మా పథకాలు బాగుంటేనే మాకు మద్దతు ఇవ్వండి, ఆశీర్వదించండి అంటున్న ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఇదే సూపరి పాలన అని యంవియస్ నాగిరెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపి గ్రంధాలయ కమిటీ చైర్మన్ మండపాటి శేషగిరి రావు,జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాస రావు, కొట్టు విశాల్, హర్టి కల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.జానకీ రామ్,చాంబరు ఆఫ్ కామర్స్ చైర్మన్ ఈతకోట భీమ శంకర రావు, వాసవి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ గ్రంధి సత్యనారా యణ, మునిసిపల్ కమిషనరు డా. ఏ శ్యామ్యూల్, పట్టణ ప్రముఖులు, పలు కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.