పుట్టపర్తి,న్యూస్ 9,అక్టోబర్:06
సమర్థవంతంగా పని చేసి ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం ఏర్పడే విధంగా పోలీస్ సేవలు ప్రజలకు అందించాలని ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ తెలిపారు.
ఒడిసి అమడుగురు నూతన ఎస్సైలు గా బాధ్యతలు స్వీకరించిన బలరాం మల్లికార్జునరెడ్డి లు శుక్రవారం ఎస్పీ చాంబర్లో, జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న బలరాం, గాండ్లపెంటలో పనిచేస్తున్న మల్లికార్జురెడ్డిలు బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన వారు, ఎస్పీ ని కలిశారు.
సమర్థవంతంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ సూచించారు.