Headlines

వినూతన రీతిలో దున్నపోతుకు వినతి పత్రం అందించిన మాజీ మంత్రి పల్లె.

 

పుట్టపర్తి, న్యూస్ 9, అక్టోబర్ 6.

జగన్ మొద్దు నిద్ర, మొండి వైఖరి వీడాలని విన్నూతన రీతిలో దున్నపోతుకు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి.
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి
చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులను నిరసిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 24 రోజులు పూర్తి చేసుకున్నాయి. పుట్టపర్తి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి నియోజవర్గ నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్లె నిరాహార దీక్ష అనంతరం దీక్షా శిబిరంలో దున్నపోతు కి వినతి పత్రం అందించి విన్నూతన రీతిలో నిరసన తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని తన మొండి వైఖరి మార్చుకోవాలని దున్నపోతుకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన పల్లె క్రమశిక్షణ పట్టుదల కలిగిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమని తమ నాయకుడు బయటికి వచ్చేంతవరకు ఈ శాంతియుత పోరాటాన్ని ఆపమని ఆయన పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కేసులు పెట్టి బెదిరిస్తున్నారని తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని ఈ సంద్భంగా వైసిపి ప్రభుత్వన్ని హెచ్చరించారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర 14 ఏళ్ల ముఖ్యమంత్రి గా చేసిన బాబు గారిని ఏటువంటి ఆధారాలు లెంకుండా దాదాపు 28 రోజులు నిర్బందించడం కేవలం కక్షపూరిత చర్యేనాని అయన అన్నారు. ప్రజలు అన్ని విషయాలూ గమనిస్తున్నారని త్వరలోనే జగన్ రాక్షస పాలనకు తప్పకుండా స్వస్తి పాలుకు తారు అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బచ్చల పుల్లయ్య గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే వందలాదిమంది పోలీసుల రక్షణ అవసరమని తనకి ప్రజల్లో తిరగాలంటే అంత భయం ఎందుకని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడంలో జగన్మోహన్ రెడ్డి చాలా బిజీగా ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ సామాన్య ప్రజలకు చేసింది ఏమీ లేదని తిరిగి చంద్రబాబు అధికారంలోకి వస్తేనే మన భవిష్యత్తు బాగుంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.