పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబరు 3 :
తాడేపల్లిగూడెంలో ప్రచార రక్షణ భేరి యాత్రలు మొదలయి తాడేపల్లిగూడెం రూరల్ మండలాలు పెంటపాడు రూరల్ మండలాలు తిరుగుతూ ప్రజారభేరి యాత్రలో కొనసాగుతున్నది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని ఓడించాలని,రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్బంధ విధానాలపై పోరాడాలని,సిపిఎం పార్టీని బలపరచమని,వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలని,లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం
సిపిఐ (ఎం) ప్రజారక్షణ భేరి జిల్లా వహించారు. పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రచారం భేరి యాత్ర ఉద్దేశించి మాట్లాడుతూ సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు చింతకాయల బాబూరావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరుపు రంగారావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ గట్టాలని వారు అన్నారు.ప్రజా రక్షణ భేరి జిల్లా, రాష్ట్ర బస్సు యాత్రలు – సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ప్రజల కష్టాలు, సమస్యలు పరిష్కారం కొరకు ప్రభుత్వాలు కృషి చేయడం లేదని,ప్రజలను కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడగొడుతున్నాయని,ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ విపరీతంగా భారాలు వేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం పన్నులు, కరెంటు చార్జీల భారాలు విపరీతంగ పెంచుతూ ప్రజా ఉద్యమాలపై తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తోందని,ఈ నేపధ్యంలో ప్రజలను మేల్కొలిపి ఐక్యం చేసి అండగా నిలిచేందుకు సిపిఐ(ఎం) రాష్ట్ర, జిల్లా ప్రజా రక్షణ భేరి యాత్రలు నిర్వహిస్తోందని వారు అన్నారు.నవంబర్ 15వ తేదీన విజయవాడ బి.ఆర్.టిఎస్ రోడ్డులోని ఫుడ్ జంక్షన్ నుండి జరిగే బ్రహ్మాండమైన ర్యాలీ,ఉదయం 11 గంటలకు సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరుగు భారీ ప్రదర్శన-బహిరంగ సభలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.మన జిల్లాలో నవంబర్ 3,4,5 తేదీల్లో రెండు ప్రచార జాతాలు పర్యటిస్తున్నాయని, పట్టణాలు, మండలకేంద్రాలు, మీదుగా ప్రధాన గ్రామాలలో ఈ యాత్రలు సాగుతున్నాయని,రాష్ట్రంలో మూడు ప్రచార జాతాలు ప్రారంభమయ్యాయని,శ్రీకాకుళం జిల్లా మందసలో నవంబర్ 2న ప్రారంభమైన జాతా 7,8,9 తేదీలలో జిల్లాకు వస్తుందని,ఈ సందర్భంగా జరిగే సభలలో సిపిఎం కేంద్ర, రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని వారు అన్నారు.అన్నీ వున్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు చక్కటి భూమి, గోదావరి, సముద్ర తీరం, ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు, ఆక్వా యితర వాణిజ్య పంటలున్నా జిల్లా సమగ్రంగా వృద్ధిచెందలేదని, ఇప్పటికీ పెద్దఎత్తున గల్ఫ్ దేశాలకు వలసలు వెళుతున్నారని, కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని,వ్యవసాయం గిట్టుబాటుకాక, పంటలకు సరైన ధర రాక రైతులు, కౌలురైతులు అప్పులపాలై మనోవేదనకు గురౌతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అంగన్వాడీ, ఆశ, మిడ్డేమీల్స్, వి.ఓ. ఏ యితర స్కీమ్ వర్కర్లకు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, భవన నిర్మాణ, పంచాయితీ, మున్సిపల్ కార్మికులకు యిచ్చిన హమీలు, ఉపాధ్యాయ, ఉద్యోగులకిచ్చిన పెన్షన్ హమీలన్నీ గాల్లో కలిసిపోయాయని,జిల్లాలో కాలుష్యం పెరిగిపోయి పంటకాలువలు, మంచినీటి చెర్వులు కలుషితమైపోయాయని, పంచాయితీలు-మున్సిపాలిటీలు
సరఫరాచేసే నీటిని వాడుకోవడానికి తప్ప త్రాగడానికి పనికిరాని విధంగా మారిపోవడంతో
టిన్నులతో మంచినీరు కొనుక్కుని త్రాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు.చర్మ, క్యాన్సర్, గుండె, లివర్ వ్యాధులు పెరిగిపోతున్నాయని,పారిశుధ్యం కరువై విషజ్వరాల బారిన పడి వేలు, లక్షలు వైద్యంకోసం అప్పుల పాలౌతున్నారని,ఆరోగ్యశ్రీ అన్ని వ్యాధులకు వర్తించడంలేదని
అందుకే ఈ యాత్రలో అసమానతలులేని రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి సిపిఎం రూపొందించిన ప్రజా ప్రణాళికను ప్రచారం చేస్తూ పాలకులతో అమలు చేయించుకోవడానికి ప్రజలంతా ఐక్యం కావాలని కదలాలని సిపిఎం పార్టీ కోరుతోందని వారు కోరారు. సిపిఎం పార్టీ కు ప్రజలు అండదండలు ఇవ్వాలని కోరారు.ఈ ఈ కార్యక్రమంలో బంకురు నాగేశ్వరరావు మరపట్ల దానయ్య పెనగంటి దుర్గా కరక వెంకట్రావు యండ్రపు కృష్ణ మాదాసు శ్రీను కర్రీ చిన్న వెంకటరెడ్డి మద్దాల సూర్రావు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.