రైతులపై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి..

 

బూర్గంపాడు 24 న్యూస్ 9

 

రైతుబంధు పడలేదు అన్న వారిని చెప్పుతో కొట్టండి అంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంకా రైతుబంధు పడలేదని రైతులు అడుగుతున్నారు అని ఒక విలేకరి అడగ్గా రైతుబంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రైతుబంధు పడలేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలంటారా అని రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ప్రశ్నించొద్దా? అని నిలదీస్తున్నారు. గ్రామాల్లో రైతులు రైతు బంధు కోసం ఎదురుచూస్తున్నారు. రైతుబంధు పడలేదని రైతులు చాలా చోట్ల ఆందోళన చేస్తున్నారు. రోజులు గడిచిన ఇంకా రెండు ఎకరాల భూమి ఉన్న వారికి కూడా పూర్తిగా పంపిణీ చేయలేదు. దీనిపై ప్రశ్నిస్తే ?మంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడ డంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే నెల నుంచే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గాంధీభవంలో మంగళవారం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఎన్నికల గ్యారెంటీల అమలుపై కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా మంత్రులు కోమటిరెడ్డి. శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ముందు ప్రకటించినట్టు గానే వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు.