అక్రమార్కులకు అండగా అధికారులు..అశ్వాపురంలో ఇటుక బట్టీలకు అనుమతి ఇవ్వలేదంటున్న పంచాయతీ సెక్రటరీలు..

  • అక్రమార్కులకు అండగా అధికారులు
  • – అశ్వాపురంలో ఇటుక బట్టీలకు అనుమతి ఇవ్వలేదంటున్న పంచాయతీ సెక్రటరీలు
  • – కాల్చిన ఇటుక బట్టీలు అక్రమంగా నడిపితే చర్యలేవి..?
  • – కళ్లున్నా కబోదుల్లా అధికారులు..ఎవరి వాటా ఎంత..?
  • – అక్రమ బట్టీలపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలి : *సామజిక కార్యకర్త కర్నె రవి

 

మణుగూరు : అశ్వాపురం మండలంలో ఉన్న కాల్చిన ఇటుక బట్టిల వివరాలు తెలియజేయాలని, అశ్వాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రజా సమాచార అధికారి (RTI PIO)ని అడగ్గా, అసలు మండలంలో ఒక్క ఇటుక బట్టి కూడా లేదని ఆయా పంచాయతీ సెక్రటరీ లు సమాచారం ఇచ్చారని సామాజిక కార్యకర్త కర్నె రవి తెలిపారు. మండలంలో ఉన్న తుమ్మల చెరువు, మనుబోతుల గూడెం చెరువులనుండి నిత్యం వందలాది ట్రాక్టర్లతో మట్టిని తీసుకు వస్తూ, ఇటుక పరిశ్రమ కు ఉపయోగిస్తున్నప్పటికి, రెవెన్యూ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని, అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు నడుపుతున్నప్పటికీ చర్యలు తీసుకోకుండా అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇటుకలు కాల్చేందుకు అటవీ కలపను అక్రమ మార్గంలో తీసుకొని వస్తున్నారని, అటవీ అధికారులు సైతం చర్యలు తీసుకోవడం లేదన్నారు.సింగరేణి బొగ్గు అక్రమంగా రవాణా చేసి ఇటుక బట్టీ కాల్చి బూడిద చేస్తున్న సింగరేణి అధికారులు చోద్యం చూస్తున్నారు, విద్యుత్ చోరీ చేసి ఇటుక బట్టీ వద్దు విద్యుత్ వినియోగం చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో ఊగుతున్నారు , ఇటుక బట్టీ కాల్చి వాయు కాలుష్యము చేస్తున్న ప్రజల ప్రాణాలు తో చెలగాటం ఆడుతున్న అధికారులు ఇటుకల బట్టి యాజమాన్యం ఇచ్చే డబ్బులు కూ ఆశ పడి చూసి చూడనట్టు వదిలి వేస్తున్నారు చెరువుల్లో మట్టి తవ్వకాలు, కలప అక్రమ వినియోగంతో ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న వారిపై పూర్తి ఆధారాలతో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని రవి అన్నారు.