స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు…ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణలు..

 

యాడికి:స్టార్ ప్రారడైజ్ హైస్కూల్ లో శుక్రవారం 75వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్టార్ పారడైజ్ హై స్కూల్ మేనేజ్మెంట్ నాగేంద్ర జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం సమరయోధులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకు ఈ స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చారని తెలిపారు. బ్రిటిష్ చట్టాలను, పాలనను పూర్తిగా తొలగించేసి భారత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్న సందర్భంగా రిపబ్లిక్ డేని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో మెలిగి ఉన్నత చదువులు అభ్యసించాలని తెలిపారు. ఉన్నత స్థాయిలో రాణించి దేశ ప్రగతిలో తమ వంతు పాత్రను నిర్వహించాలని ఆయన తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలలో పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.