టపాసుల తయారీ గోదాములో అగ్నిప్రమాదం..6 మందికి తీవ్ర గాయాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుపోవడం వలన ప్రమాదం..

  • టపాసుల తయారీ గోదాములో అగ్నిప్రమాదం
  • 6 మందికి తీవ్ర గాయాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుపోవడం వలన ప్రమాదం
  • హుటా హుటీనా వచ్చి మంటలు ఆర్పిన అజ్ఞామాపక సిబ్బంది
  • ఘటనా స్థలాన్ని సందర్శించిన సూళ్లూరుపేట ఆర్డిఓ చంద్రముని డి.ఎస్.పి

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట న్యూస్9 ప్రతినిది మండలంలోని 16వ జాతీయ రహదారి పక్కన గల మదీనా టపాసుల గోదాం లో మంగళవారం ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో ఆరు మందికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడినుండి వారిని గూడూరుకు మెరుగైన వైద్యం కోసం తరలించారు . సూళ్లూరుపేట అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి తరలివచ్చి మంటలను అదుపులో చేసి తగినటువంటి సహాయక కార్యక్రమాల్ని చేపట్టారు ఎంతో కాలము నుండి 16వ జాతీయ రహదారి ప్రక్కన హోలీ క్రాస్ దగ్గర గల జాతీయ రహదారికి పక్కన టపాసుల తయారీ జరుగుతూ ఉన్నది

ఈ టపాసులు తయారీ కేంద్రానికి ఐదు సంవత్సరముల గాను ఎన్వోసీ ఇచ్చి ఉన్నారు అయితే సంబంధిత అధికారులు ఎవ్వరు కూడా ఈ టపాసుల తయారీ కేంద్రాన్ని సందర్శించడం కానీ తనిఖీ చేయడం కానీ వారు తగినటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారా లేదా అన్నది ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఈ టపాసుల తయారీ కేంద్రం వద్ద ముందస్తు చర్యలలో భాగంగా మంటలను అదుపు చేయుటకు గాను ఇసుక బకెట్లను ఉంచవలెను తర్వాత సి ఓ టు ఎక్స్క్లూజివ్ పరికరాలు అగ్నిమాపక నియంత్రణ కొరకు టపాసుల తయారీ కేంద్రం వద్ద ఉంచవలెను మరియు ఒక నీళ్ల ట్యాంకును అంతేకాకుండా ఒక డీజిల్ జనరేటర్ ను కూడా సంబంధిత టపాసుల తయారీ స్థలం వద్ద ఉంచవలెను అంతేకాకుండా టపాసుల తయారీ కూలీలను కూడా టపాసుల తయారీలో మరియు ముందు జాగ్రత్త చర్యలలో తగిన నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను మాత్రమే తీసుకుని వారి వద్ద మాత్రమే పని చేయించవలెను అలాంటి ఏమీ లేకుండా టపాసుల తయారీ యజమాని ముందస్తు జాగ్రత్త చర్యలను గాలికి వదిలేసి టపాసుల తయారీ కేంద్రాన్ని నడపడం వలన ఇలాంటి ప్రమాదం సంభవించిందని పలువురు ఆరోపిస్తున్నారు

టపాసులు తయారీ విధానంలో అందరూ బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే అక్కడ పని చేస్తూ ఉండడంలో ఒక విషయం తెలుస్తుంది ముందు జాగ్రత్త చర్యలను గాలికి వదిలేసినటువంటి యజమానులు తక్కువ వేతనాలకు దొరికేటువంటి కూలీలను మాత్రం పెట్టుకోవడం వలన వారిలో సరైనటువంటి నైపుణ్యం లేకపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది ప్రమాదంలో గాయపడ్డ వారందరూ కూడా బీహార్ వాస్తవ్యులే గాయ పడ్డా వారి లో కొంత మందికి పూర్తి గా బట్టలు లేకుండా కాలి శరీరం కూడా చాలా వరకు ముగ్గురికి 80శాతం కాలి పోఇంది.టపాసులు పేలడం వలన సంబంధిత ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపు చేయడం జరిగింది సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రముని పుటామిటీనా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఆదేశించారు. నాయుడుపేట డిఎస్పి ఘటనా స్థలాన్ని సందర్శించి తగిన చర్యలు చేపట్టారు. సూళ్లూరుపేట ఎస్ ఐ ఘటనా స్థలాన్ని సందర్శించి తగిన సహాయక చర్యలు చేపట్టి కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.పేలుళ్లు ఎలా జరిగాయి అన్న విషయం తెలియాల్సి ఉంది.ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు