యాడికి మండలంలోవేములపాడు గ్రామ జామియా మసీదులో వజూఖానా ప్రారంభం…

న్యూస్.9) యాడికి మండలంలోవేములపాడు గ్రామ జామియా మసీదులో వజూఖానా ప్రారంభం.

 

సర్పంచ్ మైలు ఓంకారమ్మ 30000 రూపాయలు విరాళం

 

యాడికి మండల పరిధిలోని వేములపాడు గ్రామంలోని జామియా మసీదునందు గ్రామ సర్పంచ్ మైలఓంకారమ్మ సొంత నిధులతో దాదాపు 30 వేల రూపాయలు ఖర్చు చేసి వజూ ఖానా,నీటి కొళాయిలు, నీళ్ల ట్యాంకు,మరియు పెయింటింగ్ మొదలగు పనులు చేయించారు. ఇందువలన హర్షించిన ముస్లిం సోదరులు సర్పంచ్ మహిళా ఓంకార్ అమ్మ కుమారుడు సాంబశివుడికి చిరు సన్మానం చేశారు. శాలువా మరియు పూలదండతో సత్కరించారు.వజు ఖానా ను ప్రారంభించిన అనంతరం సర్పంచ్ సాంబశివుడు మాట్లాడుతూ ఆ అల్లా దయవలన భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గురువు సర్దార్ వలి హాఫిజ్ తో పాటు వేములపాడు జామియా మసీదు కమిటీ సభ్యులు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.