గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం అందించాలి… జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..

మంథని, పెద్దపల్లి

న్యూస్ 9 tv

మంథని పట్టణంలో గల 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ను బుధవారం రోజున పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు .

ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం ల ద్వారా ప్రతి గర్భిణీ స్త్రీని ట్రాక్ చేయాలని, ప్రసవాల సంఖ్య పెంచాలని,ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేలా మ్యాప్ చేసుకోవాలని, ప్రసవానికి దగ్గర ఉన్న గర్భిణీ స్త్రీలను ఆశా కార్యకర్తలు రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. మంథని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మాతా శిశు హాస్పిటల్ కేంద్రానికి కృషియల్ బ్యాలెన్స్ నుండి మంజూరు ఐనా ప్రహరి గోడ నిర్మాణానికి 36 లక్షలు మంజూరు చేయడం జరిగిందని ఈ పనులను నాణ్యత పూర్వకంగా సకలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలలో మంథని ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత అధికారులు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.