మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి జయంతి వేడుకలు… మున్సిపల్ చైర్మన్ : పెండ్రు రమ.. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ కార్యక్రమం…

న్యూస్ 9 tv

రిపోర్టర్

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో కాక వెంకటస్వామి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిల్ ప్రసాద్,పట్టణ అధ్యక్షుడు పోలు శివ ఆధ్వర్యంలో కాకా చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ప్రభుత్వ ఆసుపత్రి లో పండ్లు పంపిణి చేసారు.భవన నిర్మాణ కూలిగా మొదలైన కాకా ప్రస్థానం.. పేదలు, కార్మికుల నాయకుడిగా ఆ తర్వాత ఎంపీగా, కేంద్రమంత్రి జాతీయ స్థాయికి చేరినాడు. మెట్రిక్ మాత్రమే చదివినా ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల తరఫున ప్రసంగించే స్థాయికి తీసుకు వెళ్ళింది. స్వాతంత్ర ఉద్యమం,తెలంగాణ సాధన ఉద్యమం దాకా అన్నింటిలోనూ పాల్గొన్న కాక దేశంలోనే సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1949లో మొదటిసారిగా జాతీయ గుడిసెల సంఘం పెట్టారు. కాకా పోరాటాలతో హైదరాబాద్ నగరంలోనే 80 వేల మందికి సొంత గూడు దక్కింది. భవన నిర్మాణ కూలీలు, కార్మికుల సమస్యల పైన పోరాటాలు చేసారు.నిజం వ్యతిరేక పోరాటంలో జైలుకెల్లారు…….ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఓడ్నాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.