బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా ఇసుక లారీలు బంద్ పాటించాలి.. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి: బూడిద గణేష్…

పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతం లో బతుకమ్మ, దసరా పండుగను ద్రుష్టి లో ఉంచుకొని ఇసుక లారీలు బంద్ పాటించాలని *వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ…* తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయాలకు సంస్కృతికి అతిపెద్ద పూల బతుకమ్మ అయినా సద్దుల బతుకమ్మను మహిళలు ఘనంగా నిర్వహించుకుంటారని ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో ఊరేగింపుగా రోడ్డుమీద నుండి చెరువు గట్టు వద్దకు బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారని ఈ సందర్భంగా జన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కనుక ముందస్తుగా భారీ వాహనాలైనా ఇసుక లారీలు మరియు ఇసుక ట్రాక్టర్లు బందు పాటించాలని అలాగే దసరా పండుగ సందర్భంగా కూడా యువకులు ప్రజానీకం జమ్మి చెట్టు వద్దకు పెద్ద ఎత్తున తరలి వస్తారని ఇట్టి పండగలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఇసుక లారీలు మరియు ట్రాక్టర్లు బందు పాటించే విధంగా సంబంధిత అధికారులు ముందుస్తుగా చర్యలు తీసుకోని ఈరోజు (గురువారం )నుండి సోమవారం వరకు ఇసుక లారీలను నియంత్రించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.