గీత కార్మికుడు తాటి శంకర్ కు తీవ్ర గాయాలు..

పెద్దపల్లి, మంథని

(అక్టోబర్ 13)

పెద్దపల్లి జిల్లా మంథని :ఈత చెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని బోయిన్ పేట గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది…

 

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌడ వృత్తిలో కొనసాగుతున్న తాటి శంకర్,అనే గీత కార్మికుడు ఆదివారం ఉదయం ఈత చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయని, తెలిసింది..

 

దీంతో మంథని మండలం లోని బోయిన్ పేట గ్రామ స్తులు చికిత్స నిమిత్తం మంథనిలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా. గీత కార్మికుడు శంకర్ ను పరిశీలించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు..

 

నిరుపేద కుటుంబానికి చెందిన తాటి శంకర్ అన్ని విధాల ప్రభుత్వపరంగా ఆదుకోవాలని, మంథని గౌడ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు కోరారు.