హైదరాబాద్‌లో ట్రాఫిక్ కొత్త నిబంధనలు అమల్లోకి

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ట్రాఫిక్ నిబంధలు మరింత కఠినతరం చేశారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్‌ నగరంలో రోడ్లపై వాహనాల రద్దీ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఫలితంగా రోడ్లపైన ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అంటే ఒక్కరు కూడా వినే పరిస్థితిలో కనిపించటం లేదు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మార్పు కూడా లేదు.

రద్దీని నియంత్రించేందుకు ఇటీవల ఆపరేషన్ రోప్ చేపట్టారు. రూల్స్ పాటించని వాహనదారులకు భారీగా పైన్ విధిస్తూ ఉండటంతో అప్రమత్తంగా డ్రైవ్ చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి సర్కిల్స్ వద్ద స్టాప్‌ లైన్ దాటితే 100 రూపాయలు, ఫ్రీ లెప్ట్‌ బ్లాక్ చేస్తే 1000 రూపాయలు, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే 600 రూపాయలు, ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ ఫైన్స్ వేస్తూ వాహనదారులకు షాక్ లు ఇచ్చారు. తాజాగా ఈ రూల్స్ మరింత కఠినతరం చేశారు.

రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే రూ. 1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1200 ఫైన్ వేయనున్నట్లు శనివారం ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి దీనికి ముహూర్తం ఫిక్స్ చేశారు. రాంగ్ సైడ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా విధించనున్నారు. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28 నుంచి రాంగ్ సైడ్, ట్రిపుల్ డ్రైవింగ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు.