జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఫంక్షన్ హాలులో జిల్లా స్థాయి NHRC ముఖ్య నాయకుల సమావేశం

జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఫంక్షన్ హాలులో జాతీయ మానవ హక్కుల మండలి(NHRC) జిల్లా కమిటీ అధ్యక్షుడు మిన్నలాపురం జలందర్ గారి ఆధ్వర్యంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగిటి నరేష్ అధ్యక్షతన జనగామ జిల్లా స్థాయి NHRC ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మొగుళ్ల భద్రయ్య మాట్లాడుతూ జాతీయ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ మరియు స్టేట్ ప్రెసిడెంట్ ఐలినేని శ్రీనివాస్ గార్ల నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ మానవ హక్కుల మండలి (NHRC) రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికితీయడం,ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం,ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు దక్కేలా కృషి చేయడం,అన్ని విభాగాల్లో ఆర్టీఐ చట్టాన్ని అమలు జరిగే వరకు చర్యలకై కృషి చేయడం, సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం,మానవ హక్కుల ఉల్లంఘనను నిరోధించడం,అవినీతి అక్రమాలపై రాజీ లేని పోరాటం, లీగల్ ప్రొసీజర్ తో పని చేయడం మొదలగు ప్రధాన అంశాలపై NHRC సంస్థ కృషి చేస్తుందని తెలిపారు.ఈ సంస్థ రాజకీయ పార్టీలకు గానీ ఎలాంటి ఇతర సంస్థలకు గానీ అనుబంధం కాదు, సంబంధం లేదని స్పష్టం చేశారు.. మానవ హక్కులను కాపాడడం, మానవ సంబంధాలు మెరుగుపరచడం, మానవత్వాన్ని పంచడం వంటి ఎజెండాతో ముందుకు పోవడం మా NHRCసంస్థ ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. జిల్లాలో అన్ని కమిటీలను పూర్తి చేయాలని కోరారు.హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ అసిఫ్ పాషా గారు, సిద్దిపేట బాధ్యులు రాజయ్య, ప్రశ్నించేగొంతుక పాము రఘు గార్లు హాజరైన ఈ సభలో జిల్లా ఉపాధ్యక్షులుగా బక్క రవి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా యాసారపు కర్ణాకర్, జాయింట్ సెక్రటరీగా గొర్రె దేవదాసు గార్లకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ భద్రయ్య నూతనంగా నియామక పత్రాలు అందించారు. ఈ సమావేశంలో రమేష్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, రామచందర్, అంజయ్య,గణేష్ నాయక్ ,విష్ణు,ప్రశాంత్, ములుగు జిల్లా నాయకులు శనిగరపు ప్రవీణ్,ఎలకంటి రాజు, జనగామ జిల్లా ప్రజా సంఘాల నాయకులు, ఆర్టీఐ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు.