Headlines

మతసామరస్యానికి ప్రతీక రంజాన్.

మతసామరస్యానికి ప్రతీక రంజాన్.
— ఆలమూరులో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు.
— వేడుకల్లో పాల్గొన్న పారిశ్రామికవేత్త ఒంటిపల్లి పాపారావు.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని, ఈ రంజాన్ పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఒంటిపల్లి పాపారావు అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు కండ్రిగపేటలోని ఆల్ హుదా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో ఒంటిపల్లి పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పాపారావుకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదర, సోదరీమణులు పవిత్ర రంజాన్‌ మాసాన్ని ఎంతో నిష్టతో కఠినంగా ఉపవాస దీక్షలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారని పేర్కొన్నారు. క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ పండుగ అన్నారు. పవిత్రతకు, త్యాగానికి, సోదరభావానికి చిహ్నమైన రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొనటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అల్లాహ్ దయతో అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. శిథిలావస్థకు చేరుకున్న మసీదును సుందరంగా తీర్చిదిద్దిన ఒంటిపల్లికి ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలిపారు.