Headlines

ఇళ్ల మధ్యన రోయ్యల చేరువులకి పర్మిషన్ ఎలా ఇస్తారు.

  • ఇళ్ల మధ్యన రోయ్యల చేరువులకి పర్మిషన్ ఎలా ఇస్తారు.
  • -తాగునీరు బోరులన్ని ఉప్పునీరుగా మారాయి.
  • -బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిన్నారి

ఆత్రేయపురం: మే 09,
మండల కేంద్రం ఆత్రేయపురంలో స్థానిక పెద్దపేటలో జనావాసాల మధ్య రొయ్యల చెరువులకు అధికారులు అనుమతులు ఎలా ఇస్తారని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కాళాబత్తులు చిన్నారి ప్రశ్నించారు. డా.బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం
ఆత్రేయపురం గ్రామంలో పెద్దపేటలో జనావాసాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా రెండు చేపల చెరువులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వాటిని రొయ్యల చెరువులుగా మార్చేశారు, దాని ప్రభావంతో పెద్దపేటలో ఉన్న మంచినీటి బోర్లన్నీ ఉప్పునీరుగా మారిపోయాయి. అసలు అధికారులు జనావాసాల మధ్యన రొయ్యల చెరువులకు ఎలా పర్మిషన్ ఇస్తారని చిన్నారి ప్రశ్నించారు, చెరువు చుట్టూ ఉన్న ఇళ్ల ప్రజలు తాగడానికి నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఏవైతే బోరు పైపులు ఉన్నాయో అవన్ని ఉప్పునీరుగా మారిపోయి తాగడానికి వీలు లేకుండా పోయిందని అన్నారు. వెంటనే దీనిపై సంబంధిత ప్రభుత్వ అధికారులు, అధికారంలో ఉన్న నాయకులు వెంటనే స్పందించి దీనిపై తగుచర్యలు తీసుకోవాలని, దీనిపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత తెలియజేస్తామని తెలిపారు. పేద ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని స్థానిక కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అలాగే ఆత్రేయపురం గ్రామానికి ప్రధానమంత్రి జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ఉచిత కులాయి కనెక్షన్ అనే పదకం మంజూరు జరిగిందని, దానికి సంబంధించిన నిధులు రావడం కూడా జరిగిందని, కానీ ఒక్క చినపేటలో మాత్రమే కులాయి కలెక్షన్స్ లు ఇచ్చి, మిగతా గ్రామంలో ఎక్కడా కుళాయి కనెక్షన్ అనేది ఇవ్వలేదని చిన్నారి తెలిపారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఈ ఉప్పునీటితో చాలా ఇబ్బందులు పడుతున్నామని, వంటకి పనికి రాకుండా, తాగడానికి పనికి రాకుండా ఉండడంతో చాలా దూరం వెళ్లి మంచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని, దీనిపై అధికారులు, గ్రామ నాయకులు స్పందించి చెరువులలో రొయ్యల సాగును తక్షణమే ఆపేయాలని కోరారు.