Headlines

నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం —– ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
—– ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

రుడా చైర్మన్ షర్మిలారెడ్డితో కలిసి నియోజకవర్గంలో చెరువుల సుందరీకరణకు శ్రీకారం

కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం, గోపాలపురం, నర్సిపూడి, కొమరాజులంక గ్రామాలలోని చెరువులను రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుండి సుందరీకరించడం జరుగుతుంది అని, వాడపల్లి కొత్త వంతెన వద్ద నుండి వెళ్లే రహదారిలో వీధిలైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
ఈ మేరకు నియోజకవర్గంలోని చెరువులను రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా రోడ్లు నిర్మించామని, ప్రతీ గ్రామంలో పాలన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి గ్రామసచివాలయం భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు నిర్మిస్తున్నామని, వివిధ కమ్యూనిటీ భవనాల నిర్మాణం చేపట్టడం జరిగింది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట నియోజకవర్గ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.