Headlines

అర్హతే ప్రామాణికంగా ఇంటింటికీ సంక్షేమ ఫలాలు

అర్హతే ప్రామాణికంగా ఇంటింటికీ సంక్షేమ ఫలాలు

వాడపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా అర్హులైన ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నారని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
వాడపాలెం గ్రామంలో ఇంటింటికీ వెళ్ళి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించారు.

ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ వాడపాలెం గ్రామంలో గత 4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన బీసీ లబ్ధిదారులకు 3 కోట్ల 59 లక్షల 45 వేల 508 రూపాయలు,
ఎస్సి లబ్ధిదారులకు 3 కోట్ల 55 లక్షల 53 వేల 447 రూపాయలు,
ఎస్టీ లబ్ధిదారులకు 20 లక్షల 34 వేల 97 రూపాయలు,
మైనారిటీ లబ్ధిదారులకు 2 లక్షల 14 వేల 414 రూపాయలు,
కాపు లబ్ధిదారులకు 13 కోట్ల 48 లక్షల 17 వేల 1 రూపాయి,
ఇతర సామాజిక వర్గాల లబ్ధిదారులకు 95 లక్షల 38 వేల 323 రూపాయలు
వెరసి మొత్తం వాడపాలెం గ్రామంలో లబ్ధిదారులకు నేరుగా 21 కోట్ల 78 లక్షల 2 వేల 790 రూపాయల మేర లబ్ది చేకూర్చడం జరిగింది అని అన్నారు.
ఇవి కాక గ్రామంలో నూతన సచివాలయం భవనం, బల్క్ మిల్క్ సెంటర్, రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం జరిగింది అని, జగనన్న గోరుముద్ద, జగనన్న విధ్యాకానుక, మన బడి నాడు-నేడు తదితర పథకాల ద్వారా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడం జరుగుతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.