గన్నవరం ప్రాంతంలో మరిన్ని విద్యాసంస్థలు రావాలని గన్నవరం యం.పీ.పీ.అనగాని రవి గారు అన్నారు.గన్నవరం మండల కేంద్రం రాయనగర్ లో గురువారం నాడు శ్రీప్రజ్ఞ పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది.ఈ కార్యక్రమం లో అనగాని రవి గారు మాట్లాడుతూ విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన జితేంద్ర కుమార్ రేవినిశెట్టి, సూరి పవన్ కుమార్ గార్లు ఆధ్వర్యంలో మన గన్నవరం ప్రాంతంలో ఏర్పాటు చెయ్యడం చెయ్యడం జరిగిందని ఈ సంస్థ లో చదివిన విద్యార్థులు ఉన్నతమైన స్దానం లో ఉండాలని అనగాని రవి గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య నాగేశ్వరరావు, కృష్ణా జిల్లా కో ఆప్షన్ సభ్యులు యం.డి గౌసాని,సర్కిల్ సి.ఐ బాలమురళీకృష్ణ,గొంధి పరాందామయ్య,హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్ తుల్లిమిల్లి చిన్నారావు గార్లు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.