నంద్యాల జిల్లా సంజామల మండలం అక్కంపల్లె గ్రామంలో నివసిస్తున్న బాలిక ( 13 ) నంద్యాలలోని ఉదయానంద హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా సర్జరీ నిమిత్తం మూడు యూనిట్లు ఏ పాజిటివ్ రక్తం కావాలని డాక్టర్లు తెలపడం జరిగింది. ఒక యూనిట్ పాప మేనమామ రాయుడు ఇవ్వగా మరో రెండు యూనిట్ల కోసం రాయుడు యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యుడు పాపకు దూరం చుట్టం అయినా బడిగించల వేణు ని సంప్రదించడం జరిగింది. బడిగించల వేణు ఫౌండేషన్ ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ కు విషయం తెలియజేయగా యాడికి లోని ఫౌండేషన్ సభ్యులు సిద్ధవటం తిరుమలరెడ్డికి మరియు గుత్తి మండలం కరటికొండ సభ్యుడు కాయపాటి నరేష్ యాదవ్ కి విషయం తెలియజేసి యాడికి నుంచి నంద్యాల ఉదయానంద హాస్పిటల్ కి వెళ్లి రక్తదానం చేయడం జరిగింది. యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారికి సమాచారం ఇవ్వగానే వెనువెంటనే స్పందించి యాడికి నుంచి నంద్యాల వచ్చి రక్తదానం చేయడంతో సర్జరీ సజావుగా జరిగిందని పాప మేనమామ రాయుడు తెలియజేశారు. ఈ రక్తదాన కార్యక్రమంలో యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు బండారు బాలకృష్ణ,చింతా నరసింహ,బడిగించల వేణు, రక్తదాతలు సిద్ధవటం తిరుమలరెడ్డి,కాయపాటి నరేష్ యాదవ్ పాల్గొనడం జరిగింది.