Headlines

యాడికి మండలంలో వేములపాడు రైతు భరోసా కేంద్రంలో విత్తన పంపిణీ ప్రక్రియ ఎలా జరుగుతుందో తనిఖీ

ఈరోజు గుత్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ వెంకట రాముడు గారు యాడికి మండలంలో వేములపాడు రైతు భరోసా కేంద్రంలో విత్తన పంపిణీ ప్రక్రియ ఎలా జరుగుతుందో తనిఖీ చేయడానికి రావడం జరిగింది కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా కేంద్రంలో ఎంత మంది రైతులు వేరుశనగ విత్తనాల కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అడిగి తెలుసుకున్నారు అలాగే యాడికి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అన్ని రైతు భరోసా కేంద్రాల గ్రామ వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా అన్ని రైతు భరోసా కేంద్రాల్లోనూ ఎరువులు విత్తనాలు పురుగు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఇచ్చిన లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. శ్రీ వెంకట్ ఫర్టిలైజర్స్ దుకాణంలో పత్తి విత్తనాల వివరాలు తనిఖీ చేయడం జరిగింది,రైతులకు ప్రభుత్వం చే అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే అందించాలని MRP కంటే ఎక్కువ రేటుకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా పాల్గొన్నారు.