పేదింటి పిల్లలకు ప్రభుత్వ విద్యను అందించడమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం

పేదింటి పిల్లలకు ప్రభుత్వ విద్యను అందించడమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం : మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు
యాడికి: రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా పేదింటి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని వైసీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొంబాయి రమేష్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యారంగానికి పేదింటి పిల్లల చదువులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తున్నారని వివరించారు. ఇందులో భాగంగానే కోట్లాది రూపాయలు వెచ్చించి, మన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆదేశాలతో మనబడి నాడు నేడు కింద శిధిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు తలదన్నే రీతిలో పునర్మిస్తున్నారని ఆయన తెలిపారు. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకం కింద పాఠ్యపుస్తకములు, రాత పుస్తకాలు, పెన్నులు యూనిఫామ్, షూస్ సాక్సులు, స్కూల్ బ్యాగ్స్,తదితర వస్తువులతో కూడిన కిట్టును పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.అంతేకాకుండా పేద విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి పథకం ద్వారా 15000 రూపాయలు అందజేస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న విద్యా ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని భావి భారతదేశానికి పట్టుకొమ్మల్లా నిలవాలని, నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులుగా సమాజాన్ని ఏలాలని, వారు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కాశప్ప, హెచ్ఎం విజయమ్మ, ఎంపీటీసీ సభ్యులు వెంకట నాయుడు, అవుకు నాగరాజు, గొడ్డుమర్రి రామమోహన్, వార్డ్ మెంబర్ సభ్యులు తిరుపతి, పరమేశ్వర్ రెడ్డి, వైసిపి నాయకులు కోట చౌదరి, చిట్టెం రెడ్డి బాలిరెడ్డి, ఉపాధ్యాయులు విశ్వనాథ్, నాగన్న వీరితోపాటు తోటి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు….