అల్లు అర్జున్… ఈ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన బన్నీకి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు.
ప్రస్తుతం పుష్ప-2తో బిజీగా ఉన్న స్టయిలిష్ స్టార్ అప్పుడప్పుడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫ్యాన్స్‌ను పలకరిస్తున్నాడు. ఈ మధ్యే అమీర్‌పేట్‌లో AAA సినిమాస్ ప్రారంభం సందర్భంగా బన్నీ సందడి చేశారు. అల్లు వారి అబ్బాయిని చూసేందుకు ఫ్యాన్స్ మామూలుగా అక్కడికి చేరుకోలేదు. ఇసుకేస్తే రాలనంత జనంతో ఆ అమీర్‌పేట్ గల్లీలు నిండిపోయాయి.
ఇక ఇప్పటి వరకు అల్లు చేసిన సినిమాల గురించే చర్చించుకుంటున్నాం. కానీ తన బిజినెస్ గురించి లేదా వ్యాపార సామ్రాజ్యం గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నామా… ఒక వేళ మాట్లాడుకుంటే గీతా ఆర్ట్స్ గురించి చెప్పుకుని ఉంటాం. అయితే మెగా అల్లుడికి హైదరాబాదులో ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో తెలుసా.. మరెందుకు ఆలస్యం ఒకసారి భాగ్యనగరంలో బన్నీ బిజినెస్‌లపై ఓ లుక్కేద్దాం పదండి.
అల్లు అర్జున్ అంటే ఇప్పటి వరకు చాలామందికి ఒక సినిమా హీరో అని మాత్రమే తెలుసు. కానీ ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని కూడా చాలా తక్కువమందికే తెలుసు. బన్నీ తెరవెనుక ఉండి చేసిన బిజినెస్‌లు అవి సక్సెస్ అయిన తీరే చెబుతాయి స్టయిలిష్ స్టార్ ఒక బిజినెస్ ఐకాన్ అని. పలు రంగాల్లో అల్లు అర్జున్ వ్యాపారం ప్రారంభించారు. ఎంటర్టెయిన్మెంట్ రంగం నుంచి బెవెరెజెస్ వరకు అల్లు వారి మార్క్ కనిపిస్తుంది.
బఫెలో వైల్డ్ వింగ్స్ : బఫెలో వైల్డ్ వింగ్స్ అనేది అమెరికాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ చైన్. ఇది హైదరాబాద్‌లోని అత్యంత కాస్లీ ఏరియా అయిన జూబ్లీహిల్స్‌లో ఉంది. ఇది స్పోర్ట్స్ లవర్స్ మరియు ఫుడ్ లవర్స్‌ను భలేగా అట్రాక్ట్ చేస్తుంది. బన్నీఈ ఫ్రాంఛైజీని తీసుకుని బాగానే సక్సెస్ అయ్యారు.
ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం: అల్లు అర్జున్ ఆహాకు అనే ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంకు సహవ్యవస్థాపకులు. ఈ ఓటీటీపై తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్లు స్ట్రీమ్ అవుతాయి. ఇక ఆహా హెడ్‌క్వార్టర్స్ హైదరాబాదులోని ఫిలింనగర్లో ఉంది. ఆహా ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే జనాల్లోకి దూసుకెళ్లింది. ది మోస్ట్ హ్యాపెనింగ్ ఓటీటీ ప్లాట్‌ఫాంగా గుర్తింపు పొందింది ఆహా.