పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, జూన్ 26:
ప్రతి కుటుంబానికి ఏ ఒక్క సమస్య లేకుండా చూడడమే జగనన్న సురక్ష ముఖ్య ఉద్దేశ మని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. సోమవారం భీమవరం పురపాలక సంఘం పరిధి 1 వ వార్డు మెంటేవారి తోటలో జగనన్న సురక్ష పథకంలో భాగంగా వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వేని జిల్లా కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు సర్వే చేశారు ఏ ఏ సమస్యలు వస్తున్నాయని జిల్లా కలెక్టరు అరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆయా పథకాలు అమలు చేయడం కోసం ఖచ్చితత్వంతో కూడిన పని తీరు చూపాల్సి ఉంటుందన్నారు. శాఖల మధ్య సమన్వయం సాధించడం ద్వారా జగనన్న సురక్ష కింద వచ్చే అర్జీలను పరిష్కారం చెయ్యడంతో అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని ఆమె అన్నారు. గ్రామ సభ ఏ రోజు నిర్వహిస్తున్నామో ఆయా గ్రామాల్లో ముందస్తు సమాచారం ఇవ్వడం తో పాటు ప్రజాప్రతినిధులకు షెడ్యూల్ వివరాలు తెలియజేయాలన్నారు. ఇంటింటి సర్వేకి నిమిత్తం వెళ్ళినప్పుడు వారితో చిరునవ్వుతో పలకరించి, స్నేహపూరిత వాతా ఆవరణంలో వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు వెంట ఇంఛార్జి పురపాలక సంఘం కమిషనరు కె టి సుధాకర్, తహశీల్డారు వై రవి కుమార్, సహాయ కమిషనరు బి జ్యోతి లక్ష్మి , సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు , తది తరులు పాల్గొన్నారు.