Headlines

సరుకు లోడింగ్ లో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు.. ఒక్కరోజులోనే!!

భారత దేశంలోని 13 ప్రధాన ఓడరేవుల్లో ఒకటైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక అతి పెద్ద ఓడరేవు విశాఖపట్నం ఓడరేవు. విశాఖపట్నం ఓడరేవుకు తనదైన ప్రాధాన్యత ఉంది.

ఇది భారతదేశం యొక్క మూడవ అతి పెద్ద ప్రభుత్వ యాజమాన్య నౌకాశ్రయం. పరిణామంలో మరియు తూర్పు తీరంలో అతి పెద్ద ఓడరేవు గా ప్రసిద్ధి చెందింది.

ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఓడరేవు సరుకు రవాణాలో అనేక రికార్డులను సృష్టిస్తూ తన రికార్డులను తిరగరాస్తూ తన ఖ్యాతిని చాటుకుంటుంది. ఇక తాజాగా విశాఖపట్నం ఓడరేవు లోడింగ్ లో కూడా చరిత్రను సృష్టించింది. సరకును లోడ్ చేయడంలో కూడా తన సత్తా చాటి విశాఖపట్నం ఓడరేవు రికార్డు నెలకొల్పింది.

నూతన సాంకేతికత సహాయంతో రెండు నెలల క్రితం నెలకొల్పిన రికార్డును తిరగరాస్తూ ఒక్కరోజులోనే 50 వేల 450 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని లోడ్ చేసి తన సత్తా చాటింది. ఎంవీ జి సి ఎల్ నర్మదా కార్గో నౌకలో ఆదివారం ఒక్క రోజే 50 వేల 450 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని లోడ్ చేశారు.

ఏపీలో ఆ ఒక్కచోటే 18లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు; తవ్వితే బంగారం పంట పండనుంది!!

ఈ అతిపెద్ద లోడింగ్ ప్రక్రియ ద్వారా పోర్టు అధికారులు, సిబ్బంది తమ సత్తా చాటారు. ఈ సంవత్సరం మార్చి 26వ తేదీన అత్యధికంగా 44, 374 మెట్రిక్ టన్నుల లోడింగ్ రికార్డును నమోదు చేయగా, ప్రస్తుతం ఆ రికార్డులను అధిగమించి 50వేల మెట్రిక్ టన్నులకు పైగా ఇనుప ఖనిజాన్ని లోడ్ చేశారు. ఇక ఈ విషయాన్ని పోర్టు అధికారులు తాజాగా వెల్లడించారు.