Headlines

మహిళలపై హింసకు వ్యతిరేకంగా నిరసన

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూన్ 27 :

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ మహిళలపై హింసకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేశారు .ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి బంకుర యశోద అధ్యక్షురాలు మీసాల పావని పాల్గొన్నారు. జిల్లా కమిటీ నుంచి 5వ జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ పాల్గొని మాట్లాడుతూ రోజురోజుకీ మహిళలపై హింస పెరుగుతుందని దారుణంగా అమర్నాథ్ను హత్య చేసి పెట్రోల్ పోసి తగులు పెట్టిన ఘటన చాలా బాధాకరమని మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వాలు ఉంటున్నాయని. ఈ జరిగిన దారుణానికి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు. భక్తి పేరుతో పూర్ణానంద స్వామీజీ బాలికలపై అత్యాచారం చేయటం క్షమించరాని నేరమని తక్షణం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. స్త్రీలను లైంగికంగా వేధించటం రెండవ పౌరురాలుగా చూడటం ఇవన్నీ మనువాద బిజెపి నేర్పుతుందని మహిళలంతా దీన్ని వ్యతిరేకించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ భీమవరం పట్టణ అధ్యక్షురాలు మహమ్మద్ సరోజిని ,తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షురాలు మీసాల పావని, కార్యదర్శి బంకుల యశోద తదితరులు పాల్గొన్నారు.