పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూన్ 28:
పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన తెన్నేటి జగ్జీవన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం భీమవరంలోని కలెక్టరేట్లో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శోభారాణి చేతులు మీదుగా నియామక పత్రం అందుకున్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి నియామక పత్రాన్ని జగ్జీవన్ కు అందజేశారు. తనను ఎస్సీ ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా నియామకానికి సిఫార్సు చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కు. ఈ సందర్భంగా జగ్జీవన్ కృతజ్ఞతలు తెలియజేశారు.