Headlines

మంత్రి కొట్టు వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన బొలిశెట్టి శ్రీనివాస్

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, జూన్28 :
పాతూరులో ఒక యువకుడు మరణం పై ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. నిజా నిజాలు తెలుసుకోకుండా అనవసరంగా నోరు పారేసుకుంటున్నారంటూ వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. లింగారాయుడు గూడెంలో ఒక యాదవ కుర్రవాడిని మీ ఎంపీటీసీ చంపేస్తే మీరు తీసుకునే చర్యలు ఏంటి అని బొలిశెట్టి శ్రీనివాసు ప్రశ్నించారు. అక్రమ సంబంధాలు అంటగట్టి కేసు మాఫీ చేసే ప్రయత్నం చేసి చివరికి వైసీపీ నాయకులు లను కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసి కేసు మాఫీ చేసుకున్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలలో జన సైనికులు ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డట్లు నిరూపిస్తే ఉరి తీసేయండి. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గలాటా ను జనసేన కు ఆపాదించడం మంచి పరిణామం కాదని బొలిశెట్టి అన్నారు. ఇటువంటి నీచమైన ప్రేలాపనలు పేలితే తగిన సమయంలో బుద్ధి చెప్తాం అన్నారు. విధానపరమైన సమస్యలు గురించి మాట్లాడితే నా మీద పోటీ చేయండి నామీద పోటీ చేయండి అని మాట్లాడ్డం సమంజసం కాదు. రానున్న కాలంలో మీకు సీటు రాదనే భయంతో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారా. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలో గ్రావెల్ రోడ్డు వేయకూడదు అలాంటిది మీరు నాలుగున్నర కోట్లు ఖర్చుపెట్టి గ్రావెల్ రోడ్డు వేశామని లెక్కలు చూపించారు. గత మా పాలనపై అవాకులు చవాకుల పేలడం కాదు ప్రభుత్వం మీదే కాబట్టి ఎంక్వయిరీ వేసి నిరూపించండి. లేదా మీరు దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి ఏ దేవాలయానికి అయినా వచ్చి ప్రమాణం చేయండి నేను వచ్చి ప్రమాణం చేస్తానంటూ ఉపముఖ్యమంత్రి కి సవాలు విసిరారు. మా సొంత డబ్బులతో మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నామే కానీ అక్రమార్జన డబ్బులు మేము ఏమీ ఖర్చు పెట్టడం లేదు. పడాల కు చెందిన వైసీపీ నేత కామిశెట్టి వినోద్ ఎమ్మెల్యే బంధువునని చెప్పి ఓ రెస్టారెంట్ వద్ద కత్తులతో హడావిడి చేసినది వాస్తవం కాదా. తర్వాత పోలీసులతో దానిని మాఫీ చేసే ప్రయత్నం చేయలేదా. మీరు చేసే అగత్యాలు పక్కన పెట్టి ఎక్కడో ఏదో జరిగితే అటువంటివి మాకు ఆపాదించడం సమంజసం కాదని పోలిశెట్టి విరుచుకుపడ్డారు. మేము కట్టిన పార్కులు పాడైపోయాయి, రోడ్లు పాడైపోయాయి, వర్షాకాలంలో సైతం విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. ఇవన్నీ వాస్తవం కాదా? మట్టి, లిక్కర్, మైనింగ్ ఎలా అమ్ముతున్నారు ఎలా డబ్బులు దోచుకుంటున్నారు అని అడిగితే సమాధానాలు సక్రమంగా చెప్పలేక ఇలా పనికిమాలిన మాటలు మాట్లాడటం సమంజసం కాదు. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ ఇక్కడకు వస్తాడు మీ చిట్టా మొత్తం బయటపెడతాడు. వరాహి యాత్ర విజయవంతం కావడంతో ఓర్చుకోలేక ఇటువంటి అనవసర ప్రేలాపనలు పలుకుతున్నారంటూ కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలపై బొలిశెట్టి విరుచుకుపడ్డారు.