Headlines

చదువుకునే చిన్న పిల్లల ఎదుగుదలను కోరుకున్న చవ్వా గోపాల్ రెడ్డి 

అనంతపురం జిల్లా యాడికి మండలం ఉప్పలపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం గురుకుల పాఠశాలకు 16 మంది విద్యార్థులు ఎంపిక అవడంతో అనంతపురం జిల్లా క్లాస్ వన్ కాంట్రాక్టర్ చవ్వ గోపాల్ రెడ్డి  ఆ పిల్లలకు పాఠ్య పుస్తకాలు. పెన్ను పెన్సిల్లు చదువుకు అవసరమైన వస్తువులను అందజేస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. అలాగే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇద్దరు బదిలీపై వెళ్తున్న వారిని చవ్వ గోపాల్ రెడ్డి ఘనంగా సన్మానించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ .. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు చదువు బాగా చెప్పడం వల్లే గురుకుల పాఠశాలకు ఈ సంవత్సరం 16 మంది విద్యార్థులు ఎంపిక కావడం చాలా సంతోషించదగ్గ విషయమని ఆయన ఉపాధ్యాయులను పిల్లలను కొనియాడారు. ఇలాగే పిల్లలు మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని పిల్లలకు తెలిపారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల ఎదుగుదల కోసం తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు. గ్రామ సర్పంచ్ భర్త రామాంజనేయులు. ఉప్పలపాడు గ్రామ మాజ