Headlines

బోధన అవసరాల మేరకే ధనుంజయరావు బదిలీ

బోధన అవసరాల మేరకే ధనుంజయరావు బదిలీ

— పారదర్శకంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్

— యూనివర్సిటీలో ఎటువంటి అవినీతి జరగలేదు

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆగస్టు 5:

డాక్టర్ వైయస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ధనుంజయరావును బోధన అవసరాల మేరకు, పరిశోధనల కొరకు వేరే ప్రాంతానికి బదిలీ చేయడం జరిగిందని యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ బి. శ్రీనివాసులు శనివారం ప్రకటనలో తెలిపారు. బదిలీని వ్యతిరేకిస్తు.డి హెచ్ పి ఎస్, కే ఎన్ పి ఎస్, కెవిపిఎస్ సంఘాల జిల్లా ప్రతినిధులు యూనివర్సిటీ పై అవగాహన లేకుండా అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు .అలాగే బదిలీ అయిన ధనుంజయరావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే కుల వివక్షకు పాల్పడుతూ బదిలీ చేశారని ఆరోపించడం సరికాదన్నారు గతంలో పలువురు డైరెక్టర్లను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశామనివాటిపై విమర్శలు లేవని రిజిస్టార్ తెలిపారు. అంతేకాకుండా వైస్ ఛాన్స్లర్ జానకిరామ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో, అవినీతికి పాల్పడ్డారని డి హెచ్ పి ఎస్, కే ఎన్ పి ఎస్, కెవిపిఎస్ సంఘాల జిల్లా ప్రతినిధులు చేసిన ఆరోపణలు ఎంత మాత్రం నిజం లేదన్నారు. యూనివర్సిటీ అనుబంధ 20 కళాశాలలో ఎక్కువ శాతం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే ప్రధాన అధికారులుగా ఉన్నారు అన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలుకు లోబడి రూల్ రిజర్వేషన్ పాటిస్తున్నామని రిజిస్టార్ తెలిపారు .వారు చేసిన ఆరోపణలను యూనివర్సిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీలో కులవివక్ష, అవినీతి తదితర అంశాలపై ఎస్సీ కమిషన్ కు, రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడంచాలా బాధాకరం అన్నారు .మహిళా రైతులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం, రైతులకు చూసినలుసలహాలు అందిస్తూ హార్టికల్ యూనివర్సిటీ రాష్ట్రంలోనే ముందంజలో ఉందన్నారు. యూనివర్సిటీలో సహృదయ వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రిజిస్టార్ శ్రీనివాసులు కోరారు.