పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఆగస్టు 7:
జాతీయ చేనేత దినోత్సవం స్ఫూర్తితో నేతదారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు.సోమవారం తొమ్మిదవ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి చేనేత కార్మికులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ స్థానిక తిరుమల కాలేజీ సెంటర్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల స్టాల్ ను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పరిశీలించి, వస్త్రాల వివరాలను, ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పందన సమావేశ మందిరంలో చేనేత కార్మికులతో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఉత్సాహంగా, అంకితభావంతో జరుపుకోవడమే కాకుండా చేనేత వస్త్రాలు కొనుగోలు ద్వారా కార్మికులకు అండగా నిలవాలన్నారు. చేనేత పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక చేనేత కార్మికులు, చేతివృత్తులదారులు ఆర్థికంగా బల్పడేందుకు ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద మనం తయారు చేసిన వస్తువుల విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం జరుగుచున్నదన్నారు. మన జిల్లాకు సంబంధించి ప్రాముఖ్యమైన వస్తువుగా లేస్ అల్లికలను గుర్తించడం జరిగింద అన్నారు. చేనేత వస్త్రాలు ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, పొల్యూషన్ ఫ్రీగా ఉంటాయన్నారు. చేనేత సొసైటీలు బలోపేతంతో నేతదారుల ఆర్థిక లబ్ధికి దోహదపడుతుందన్నారు. చేనేత కార్మికులు వృత్తి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం నేతన్న నేస్తం ద్వారా సంవత్సరానికి రూ.24 వేల రూపాయల చొప్పున మన జిల్లాలో 1,027 మంది లబ్ధిదారులకు అందజేయడం జరుగుచున్నదన్నారు. వృద్ధ చేనేత కార్మికులకు రూ.3 వేలు పింఛను కూడా అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, డిపిఓ మల్లికార్జున రావు, డీఈవో ఆర్.వి రమణ చేనేత కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.చేనేత కార్మికులు కుమారస్వామి తదితరులు మాట్లాడుతూ చేనేత ఉత్పలపై జీఎస్టీ ని ఎత్తివేయాలని, విద్యుత్తు ఫ్రీగా ఇవ్వాలని ఈ సందర్భంగా సభలో కోరారు.చివరిగా చేనేత కార్మికులకు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు.ఈ ర్యాలీ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ ఇంచార్జ్ ఏడి బి.రామయ్య, కార్పొరేషన్ డైరెక్టర్ అందే నాగభూషణం, డిపిఓ మల్లికార్జునరావు, డీఈవో ఆర్ వెంకట రమణ, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగ సాయి, తదితరులు పాల్గొన్నారు.