Headlines

నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి……. జిల్లా కలెక్టర్ ప్రశాంతి……

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం, ఆగస్టు 7:

నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని నా మట్టి .. నా దేశం స్ఫూర్తిగా సెల్ఫీ దిగి అందరికీ ఆదర్శంగా నిలిచారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి.స్థానిక కలెక్టర్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ వద్ద సోమవారం జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో “నా మట్టి -నా దేశం, నేల తల్లికి నమస్కారం – వీరులకు వందనం “అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈనెల 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నా మట్టి.. నా దేశం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడానికి ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, పట్టణ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. దేశ సంక్షేమం కోసం ప్రాణ త్యాగాలు చేసిన స్థానిక మహనీయులను, సాహసవంతులు, వీరులను స్మరించుకోవడం జరుగుతుందన్నారు. ఈనెల 9వ తేదీన అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సందేశంతో పాటు దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులు, త్యాగధనులు, వీరులను గుర్తు చేసుకుంటూ అమృత సరోవర్లు నీటి వనరుల వద్ద జ్ఞాపక శిలాఫలకాలను ఏర్పాటు చేసుకొని సెల్ఫీలను దిగి నిర్ణీత వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ కార్యక్రమంలో ప్రజలందరూ మట్టిని గాని మట్టి దీపాన్ని గాని చేతిలో ఉంచుకొని పంచ ప్రాణ ప్రతిజ్ఞ చేయడం, శిలాఫలకాల చుట్టూ మట్టి దీపాలను వెలిగించడం చేయాలన్నారు.
11వ తేదీన వసుధకు వందనం పేరుతో 75 మొక్కలను నాటడం, 14వ తేదీన వీరులకు వందనం చేపట్టి మరణించిన వీరుల కుటుంబాలను, జీవించి ఉన్న వీరులను సత్కరించి ఫోటోలు అప్లోడ్ చేయడం, ఈనెల 16 నుండి 20వ తేదీ వరకు మండలాలు, పెద్ద మున్సిపాలిటీలలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామపంచాయతీలు, మండలాలకు చెందిన యువత వారి ప్రాంతాల్లోని మట్టిని కళశంలలో తీసుకుని ఢిల్లీకి ప్రయాణమై ఈనెల 27, 28 తేదీలలో ఢిల్లీకి చేరుకుని అక్కడ కర్తవ్యపద్ లో జరిగే ముగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.