Headlines

టిడిపి జాతీయ అధ్యక్షుడుపై రాళ్ల దాడిని ఖండించిన యాడికి మండల టిడిపి నాయకులు

 

యాడికి ఆగష్టు న్యూస్:9.టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పై పుంగనూరు పర్యటనలో వైసిపి కార్యకర్తలు రాళ్ల దాడి చేయటాన్ని యాడికి మండల టిడిపి నాయకులు తీవ్రంగా ఖండించారు. టిడిపికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసిపి కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉందని అన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఓటమి ఖాయమని తెలిసి ఈ విధంగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, మాజీ ఎంపీటీసీ దడియాల ఆది, బీసీ సెల్ స్పోక్స్ పర్సన్ మధురాజు, తాండ్ర విక్రమ్, నీలకంఠారెడ్డి తదితరులు పాల్గొన్నారు.