Headlines

యాడికి మండలం బిజెపి పార్టీ తరఫున జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు

తేదీ 07.08.2023
యాడికి మండలం బిజెపి పార్టీ తరఫున జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు యాడికి బిజెపి మండల అధ్యక్షుడు పొట్టే గంగాధర్ మాట్లాడుతూ ఆగస్టు 7 వ తారీకు జాతీయ చేనేత దినోత్సవం గా ప్రకటించి చేనేత కార్మికులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఖ్యాతి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దక్కుతుందని అలాగే ఈ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు పెద్దలు శ్రీ చంద్రమౌళి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి సింగరి లక్ష్మినారాయణ గారి ని కలిసి రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని ప్రతి చేనేత కుటుంబానికి 100 యూనిట్లు కరెంటు ఉచితం అని చెప్పి అది అమలు చేయకపోగా అదనంగా నాలుగు సంవత్సరాలలో ఏడుసార్లు విద్యుత్ చార్జ్ పెంచినారు అలాగే నేతన్న నేస్తం అమ్మ ఒడి పథకల కు బటన్ నొక్కి నెలలు కడుస్తున్న వారి ఖాతాలో నేటికీ డబ్బులు జమకాలేదని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యని ఒకటే ఇస్తున్నారని కొన్ని నెలలుగా రాష్ట్ర కోట కింద బియ్యాన్ని కంది బేళ్ళని ఇవ్వలేదని అలాగే అర్హులైన ప్రతి చేనేత కార్మికులకు ముద్ర లోన్ ఇవ్వాలని యాడికి చేనేత కార్మికులకి పింఛన్ ఐడి నెంబర్ వచ్చిన రెండు నెలలు గా పింఛన్ ఇవ్వ లేదన్నారు 50 వేలు పేచులకు జనాభా ఉన్న యాడికి మండలానికి నేటికి గవర్నమెంట్ కాలేజ్ రాలేదని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వద్ది రాజశేఖర్ ప్రధాన కార్యదర్శులు చింత చౌడయ్య నారాయణస్వామి ఓ బి సి మోక్ష అధ్యక్షులు రంగస్వామి ప్రధాన కార్యదర్శి కృపాకర కార్యదర్శులు జక్క ప్రసాద్ కంభగిరి రాముడు చంద్రమౌళి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు