శ్రీ సత్య సాయి జిల్లా.పుట్టపర్తి.ఆగస్టు 8
పుట్టపర్తి. వీఆర్ఏల సమస్యలపై రెండో రోజు జరిగిన నిరసన కార్యక్రమంలో అర్థనగ్నంగా ఒంటి కాళీ మీద నిలబడి జగనన్నకు దండం పెడుతూ నిరసన చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్ వెంకటేష్ గారు మాట్లాడుతూ… విఆర్ఎలకు ఒక్క రూపాయి పెంచకపోగా వున్నటువంటి డిఏను కూడా కోత విధించింది. డిఏ రికవరీ ఆపాలని ఎన్ని సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఏ మాత్రం కనికరించలేదన్నారు.
నేటి ముఖ్యమంత్రి ఎన్నికల మందు ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాలుగా విఆర్ఎ సమస్యలను పరిష్కరించాలని అనేక సార్లు అధికారులకు ప్రభుత్వ పెద్దలకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఈరోజు సత్యసాయి జిల్లా ఆర్డిఓ కార్యాలయం ముందు జరిగిన నిరసనలో అర్ద నగ్నంగా ఒంటి కాల మీద నిలబడి ఇప్పటికైనా మా న్యాయమైన సమస్యలపై కనికరించు మహానుభావా అని దండాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న వేతనాన్ని కుటుంబం ఖర్చులకు కూడా సరిపోడం లేదని మా పిల్లల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలని ఆవేదనకు గురవుతున్నారు. వీఆర్ఏల పట్ల ప్రభుత్వం ఇలా మొండిగా వ్యవహరించడం సరికాదనే వాపోయారు. వీఆర్ఏలు మా చీకటి బ్రతుకులనుండి వెలుగు నింపే వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడం తిప్పను అనే పదాన్ని నిరూపించుకోవాలని నిరూపించి మా బ్రతుకులో వెలుగు నింపాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి విన్నపం తెలపడం జరిగింది.విఆర్ఎలకు వెంటనే పే స్కేలు అమలుచేయాలని, నామీనులుగా పనిచేస్తున్న వారందరిని విఆర్ఎలుగా నియమించాలని, విధులు నిర్వర్తిస్తూ 65 సంవత్సరాల పైబడిన వారు మరణించిన ఎడల వారి కుటుంబంలో ఒకరికి అర్హులకు వీఆర్ఏగా నియమించాలని విన్నపం. అర్హులైన వారికి విఆర్ఏ, అటెండర్, వాచ్మెన్ వీఆర్వో ల ప్రమోషన్స్ ఇవ్వాలని, డిఎ రికవరీ నిలిపి రిటైర్డ్ బెనిఫిట్స్ తో కూడిన వేతనం అమలు చేయాలనీ దశల వారీ ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు.
వీఆర్ఏల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళనకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
*ఆగష్టు 25న జగనన్నకు నేరుగా చెబుదాం! ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుధాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి ప్రసాద్, నాయకులు పెద్దన్న, నరసింహులు, నరసప్ప. పద్మావతి, లక్ష్మీదేవి, సంధ్య నారాయణమ్మ జిల్లాల నలుమూలల నుండి వచ్చిన విఆర్ఏల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.