బలిజ సంఘం ఆధ్వర్యంలో రాయల్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ

యాడికి మండల కేంద్రంలోని ప్యారడైజ్ స్కూల్ వెనుక భాగాన బలిజ సంఘం ఆధ్వర్యంలో రాయల్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం బలిజ సంఘం అధ్యక్షులు బండారు హరినాథ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమానికి బొంబాయి రమేష్ నాయుడు పాల్గొన్నారు, అలాగే దాసరి శ్రీనివాస్, గిరి ,కంబగిరి రామంజి,రాయుడు, తదితర బలిజ కులస్తులు పాల్గొన్నారు ఈ ఫంక్షన్ హాల్ కు క్రీస్తు శేషులు కాసా సుశీలమ్మ జ్ఞాపకార్థంగా కాసా చంద్రమోహన్ 30 సెంట్లు భూమిని బలిజ సంఘానికి వితరణ చేశారు,