మానసిక వికాసానికి క్రీడలు దోహదం
ఆ అధికారి పలువురికి ఆదర్శం
*పిల్లలతో మమేకమై పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్న శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు మండలం వార్డెన్ లక్ష్మీ నారాయణ
క్రీడలు మానసిక వికాసానికి దోహదమని వార్డెన్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.మండల కేంద్రంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య ఉన్న బీసీ వసతి గృహం వార్డెన్ లక్ష్మీనారాయణ పలువురి అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.తన విధుల పట్ల నిజాయితీ నిబద్ధత నిక్కచితంగా వ్యవహరించడమే కాకుండా పిల్లలకు తనదైన రీతిలో దగ్గరవుతూ అందరి మన్ననలను పొందుతున్నాడు.పిల్లలకు విద్య ఒక్కటే ముఖ్యం కాదని పిల్లలలో మానసిక ఒత్తిడిని తొలగించడంలో క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయి అంటున్నాడు.క్రీడలనేటివి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాకుండా మనిషికి మనిషికి మధ్య ప్రేమ అనురాగాలు పెంచుతాయని పేర్కొంటున్నారు.మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో గత రెండు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న వార్డు లక్ష్మీనారాయణ తనదైన రీతిలో విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు నేర్పించడంలో నిమగ్నమయ్యారు.తన సొంత నిధులతో వాలీబాల్ క్రికెట్ వంటి ఆట వస్తువులను కొనుగోలు చేసి విద్యార్థులతో కలిసి విద్యార్థులకు ఆటలు నేర్పిస్తూ వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందింప చేస్తున్నారు.వసతి గృహంలో మొత్తం 119 మంది విద్యార్థులు ఉన్నారు.విద్యార్థులందరని తన సొంత పిల్లల్లా చూసుకుంటూ విద్యార్థులకు అందాల్సిన మెనూలో ఎటువంటి రాజీ పడకుండా తన సొంత నిధులతో అయినా సరే అందజేస్తున్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు.ప్రభుత్వం పిల్లలకు అందించు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా మెను ప్రకారం అందిస్తున్నారని విద్యార్థులు తెలుపుతున్నారు.ఇటువంటి వార్డెన్ ఆధ్వర్యంలో తాము విద్యను అభ్యసించడం ఎంతో సంతోషంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థుల హాజరు శాతంలో రాజీ పడకుండా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే దిశలో ప్రతిరోజు విద్యార్థులను పర్యవేక్షిస్తూ వసతి గృహం విద్యపై పేద విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విధంగా అడుగులు ముందుకేస్తున్నారు.ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 10వ తరగతి నందు దాదాపు వసతిగృహంలో 99% ఉత్తీర్ణత సాధించారు.పిల్లల భవిష్యత్తు కేవలం ఒక విద్యతోనే కాకుండా క్రీడలతో కూడా ముడిపడి ఉందని ఆయన పేర్కొంటున్నారు.అందువల్లనే విద్యార్థులతో కలిసి ఆటలు ఆడుతానని తెలుపుతున్నారు.విద్యార్థులకు ఉపాధ్యాయులు అంటే అభిమానం గౌరవం ఉండాలే కానీ భయం ఉండకూడదని అందువల్లనే విద్యార్థులతో కలిసి ఆటలు ఆడుతామంటున్నారు.ఇటువంటి వార్డెన్లు ఉండడంవల్ల వసతి గృహంలో విద్యార్థులను తల్లిదండ్రులు నిర్భయంగా చేర్చవచ్చని మండల ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.మండలంలో పలువురి అధికారులకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదని వసతి గృహ విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.