Headlines

నల్లచెరువు కృష్ణుడి వేషంలో చిన్నారులు భక్తులతో కిక్కిరిసిన పలు ఆలయాలు

 

శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీకృష్ణడి జన్మదినాన్ని పురష్కరించుకొని నల్లచెరువు మండల వ్యాప్తంగా వేడుకలు జరుపుకున్నారు. దశావతారాల్లో కృష్ణావతారం ఒక్కటిగా భక్తులు చెప్పుకుంటారు. భక్తకోటిని పులకింపజేసే పర్వదినాలలో కృష్ణాష్టమి విశిష్టమైనది. కృష్ణావతారం అంటే ప్రేమ, ప్రేమయే దైవం. జగమంతా ప్రేమ మయం. జనులను ప్రేమతో బ్రోచేందుకు భగవానుడు ప్రేమ స్వరూపుడై మానవావతారం ఎత్తాడని భక్తులు విశ్వసిస్తారు. కృష్ణుడు తన చిన్న తనంలో ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న ఇలా గోపికల ఇంట దొంగలించి తన స్నేహితులకు పంచి పెట్టేవాడు. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా చిన్నపిల్లలు కృష్ణుని వేషాధరంలో ప్రత్యేక ఆకర్షణ గణించారు.పలు ఆలయాలలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించగా భక్తులతో ఆలయాల కిక్కిరిస్తాయి.