Headlines

ప్రతి బుధవారం, శుక్రవారం మండల స్థాయిలో గ్రీవెన్స్ డే: కలెక్టర్ పి.ప్రశాంతి

 

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం సెప్టెంబర్ 6:

ప్రతి బుధవారం, శుక్రవారం మండల స్థాయిలో గ్రీవెన్స్ డే జరపనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి సోమవారం నిర్వహించే జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంకు అదనంగా మండల స్థాయిలో ప్రతి బుధ, శుక్రవారంలలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 8వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు యలమంచిలి మండలం నుండి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ప్రతివారం ఒక మండలంలో ప్రత్యేక గ్రీవెన్స్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభించడం జరుగుతుందన్నారు. మండలాల వారిగా సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమై నవంబర్ 15 వరకు మండల స్థాయి గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అందరూ జిల్లా అధికారులుతో కలిసి నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లు, తహశీల్దార్ లు మండల స్థాయి గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

మండల స్థాయి జగనన్నకు చెబుదాం ప్రోగ్రామ్ షెడ్యూల్

సెప్టెంబరు 08 యలమంచిలి రూరల్, 13వ తేది ఉండి రూరల్, 15వ తేదీ వీరవాసరం రూరల్ ప్రాంతాలకు ఎంపీడీవో కార్యాలయాల మీటింగ్ హాల్స్ లో, 20వ తేదీ భీమవరం రూరల్, అర్బన్ ప్రాంతాలకు మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్ నందు, 22వ తేదీ మొగల్తూరు రూరల్, 27వ తేదీ పాలకోడేరు రూరల్ ప్రాంతాలకు ఎంపీడీవో కార్యాలయాల మీటింగ్ హాల్స్ నందు, 29వ తేదీ నరసాపురం రూరల్, అర్బన్ ప్రాంతాలకు మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్ నందు, అక్టోబర్ 4వ తేదీ కాళ్ళ రూరల్ ప్రాంతానికి ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్ నందు, 6వ తేదీ పాలకొల్లు రూరల్, అర్బన్ ప్రాంతాలకు మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్ నందు, 11వ తేదీ పెంటపాడు రూరల్, 13వ తేదీ పోడూరు రూరల్ ప్రాంతాలకు ఎంపీడీవో కార్యాలయాల మీటింగ్ హాల్స్ నందు, 18వ తేదీ తాడేపల్లిగూడెం రూరల్, అర్బన్ ప్రాంతాలకు మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్ నందు, 20వ తేదీ పెనుమంట్ర రూరల్, 25వ తేదీ గణపవరం రూరల్, 27వ తేదీ పెనుగొండ రూరల్ ప్రాంతాలకు ఎంపీడీవో కార్యాలయాల మీటింగ్ హాల్స్ నందు, నవంబర్ 1వ తేదీన ఆకివీడు రూరల్, అర్బన్ ప్రాంతాలకు మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్ నందు, 3వ తేదీ ఆచంట రూరల్, 8వ తేదీ అత్తిలి రూరల్ ప్రాంతాలకు ఎంపీడీవో కార్యాలయాల మీటింగ్ హార్స్ నందు, 10వ తేదీ తణుకు రూరల్, అర్బన్ ప్రాంతాలకు మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్ నందు, 15వ తేదీ ఇరగవరం రూరల్ ప్రాంతానికి ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్ నందు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.