అనంతపురం. న్యూస్ 9 . సెప్టెంబర్ 7.
ఉమ్మడి అనంతపురం జిల్లా మూడు రోజుల పర్యటనలో భాగంగా కళ్యాణదుర్గం నందు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల కోసం పోరాడుతూ పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న స్వర్ణాంధ్ర సృష్టికర్త అమరావతి అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని* కళ్యాణదుర్గం క్యాంప్ సెట్ నందు మర్యాదపూర్వకంగా కలిసి దృశ్యాలతో సన్మానించి ఈ మేరకు గురువారం నాడు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి కృషి చేస్తున్నామని అలాగే బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి,సంక్షేమం రాజకీయ ఆర్థిక స్వాతంత్య్రం టీడీపీ వల్లే సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసిన శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ తెలియజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం లో చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరిస్తూ అలాగే బలహీనవర్గాల అభ్యున్నతి,సంక్షేమం,రాజకీయ,ఆర్థిక స్వాతంత్య్రం టీడీపీ వల్లే సాధ్యమవుతుందని,తన అనుచర గణంతో వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో రాష్ట్రంలో విజయ డంకం మోగిస్తుందని తెలియజేశారు నియోజకవర్గంలో పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు తెలుగుదేశం పార్టీ తనకు తగిన ప్రాధాన్యత కల్పించాలని విన్నవించారు. అందుకుగాను బాబు స్పందిస్తూ పార్టీ అభివృద్ధికి కష్టపడే వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని,మీరు చేస్తున్నట్టు కార్యక్రమాలు ప్రజల వద్దకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మీకు తగిన గుర్తింపు వచ్చే విధంగా మేము భరోసాని కల్పిస్తామని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.