శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రం బసవన్నకట్ట మెయిన్ బజార్లో విద్యుత్ స్తంభాలతో పొంచి ఉన్న ప్రమాదం ఇనుప విద్యుత్ స్తంభాలు విరిగిపోయి ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు విద్యుత్ స్తంభాలు విరిగి కింద పడతాయో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నామని ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇదే దారిలో అధికారులు నాయకులు వెళ్తున్న సమస్యను చూసిచూన్నట్లు వెళ్లిపోతున్నారు. ఏ విద్యుత్ స్తంభానికి లైట్లు కూడా వెలగడం లేదని చీకట్లో పాములు పెడతా ఎక్కువగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి నూతన విద్యుత్ స్తంభాలు నూతన లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.