టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ సంచలన విషయాలను వెల్లడి

టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ సంచలన విషయాలను వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ..ఎవరి పాత్ర ఏంటనేది ప్రస్తావించింది.

విజయవాడ కోర్టులో చంద్రబాబును ప్రవేశ పెట్టిన సీఐడీ తన వాదనలు వినిపిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు స్వయంగా తన వానదలను కోర్టు ముందు ఉంచారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో ఈ స్కాంలో లబ్ది పొందేందుకు ప్రభుత్వ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరించాలని అభియోగాలు నమోదు చేసింది.

చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ మాజీ మంత్రులు లోకేశ్..అచ్చెన్నాయుడు పేర్లను ప్రస్తావన చేసింది. ఇదే రిపోర్టులో నెల క్రితమే ఈడీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిందని పేర్కొంది. 2023 ఆగస్టె న దొండపాటి హరీష్ అనే ఐఆర్ఎస్ అధికారి ఈ నోటీసులు జారీ చేసారని వెల్లడించింది. రిమాండ్ రిపోర్టులో లోకేష్ పేరు చేర్చిన సీఐడీ కిలారు రాజేష్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని పేర్కొంది. స్కిల్ స్కాంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారుడని సీబీఐ పేర్కొంది. బాబు పై కుట్ర, ప్రజాధనం దుర్వినియోగం, మోసం అభియోగాలు ఉన్నాయని పేర్కొంది. స్కిల్ స్కాంలో రూ 550 కోట్ల మేర కుంభకోణం జరిగిందని వివరించింది. ప్రభుత్వ సొమ్మును షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్ వాయిస్ ల ద్వారా మళ్లించారని సీఐడీ తెలిపింది.

స్కిల్ స్కాంలో ప్రభుత్వానికి రూ 300 కోట్లు నష్టం జరిగిందని పేర్కొంది. ఒప్పందం ఉల్లంఘిస్తూ రూ 371 కోట్ల మేర అడ్వాన్ససులు చెల్లింపు జరిగిందని వివరించింది. ప్రభుత్వ నిధుల్లో భారీ మత్తం షెల్ కంపెనీలకు తరలించారని వివరించింది. చంద్రబాబు డైరెక్షన్ లోనే ప్రభుత్వ నిధులు షెల్ కంపెనీలకు మళ్లించారని పేర్కొంది. కీలక డాక్యుమెంట్ల మాయం వెనుక చంద్రబాబు హస్తం ఉందని వెల్లడించింది.

మరింత విచారణకు చంద్రబాబును కస్టడీకి తీసుకోవాల్సి ఉందని కోరింది. అధికారులు ఇచ్చిన వాంగ్మూలంతో చంద్రబాబే సూత్రధారి అని తేలిందని రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొంది. ఈ స్కిల్ ప్రాజెక్టు వివరాలను అచ్చెన్నాయుడుకి సమర్పించారు. ప్రాజెక్టులో లోటు పాట్లు తప్పిదాలు ఉన్నప్పటికీ చంద్రబాబు, అచ్చెన్నాయుడు కలిసి ఓకే చేసారని సీఐడీ వివరించింది.

చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందాయని, స్కిల్ స్కాం కు సంబంధించి ఈడీ విచారణ చేస్తోందని వివరించారు. ఈడీ విచారణ కీలక దశలో ఉందని పేర్కొంది. కేసులో మనోజ్ వాసుదేవ్ కు సెప్టెంబర్ 5న నోటీసులు ఇచ్చామని కోర్టుకు నివేదించింది. తమ నోటీసులకు జవాబు ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారని వివరించింది.

వీళ్లను చంద్రబాబు కాపాడుతున్నారనేది తమ అనుమానంగా సీఐడీ పేర్కొంది. ఇదే సమయంలో చంద్రబాబును కస్టడీ ఇవ్వాలని సీఐడీ కోరుతండటంతో అటు చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు తనతంటగా తాను వాదనలు వినిపిస్తూ ఈ కేసులో తన ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. దీంతో, కోర్టు తీర్పు పైన ఉత్కంఠ కొనసాగుతోంది.