Headlines

మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా.

 

పుట్టపర్తి, న్యూస్ 9, అక్టోబర్ 2.

* మిస్ అయిన ఫోన్లు దొరికితే వాటిని పోలీసులకు అందజేస్తే సన్మానం.
* ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లలో రికవరీ చేసి 372 మొబైల్స్ ఎస్పీ చేతుల మీదుగా అందజేత.

జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్.

* స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఈరోజు రూ. 73 లక్షల విలువ చేసే అందజేసిన మొబైల్స్ 372

* చాట్ బాట్ సేవల ద్వారా ఇప్పటి వరకు రూ. 12.03 కోట్లు విలువ చేసే 7417 మొబైల్ ఫోన్లు అందజేత

* ఈసారి వినూత్నంగా ఆలోచించి సెల్ ఫోన్ దొంగతనానికి గురయ్యిందా లేదా మిస్సయ్యిందా అనే కోణంలో పరిశీలిస్తామన్న జిల్లా ఎస్పీ

* ఒకవేళ దొంగతనానికి గురయ్యి ఉంటే వాటిపై నిఘా ఉంచుతాం. మిస్ అయ్యి ఎవరికైనా దొరికితే వారు ఆ ఫోన్ ను పోలీసులకు అందజేస్తే సన్మానిస్తాం

* జిల్లాలో సైబర్ నేరాల విషయంలో పోలీసుశాఖ సీరియస్ పరిగణించింది. సైబర్ నేరాలకు సంబంధించి గత 10 రోజుల్లోనే 251 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో దాదాపుగా పరిష్కారం చూపాం. మిగిలిన వాటిని త్వరలో పరిష్కరిస్తాం. సైబర్ నేరాలపై 1930 నంబర్ కు ఫిర్యాదులు పంపవచ్చు

* చాట్ బాట్ లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిఈఐఆర్ ద్వారా నమోదు చేసుకోవాలి. సిఈఐఆర్ లో ఎలా నమోదు చేసుకోవచ్చో చాట్ బాట్ లో సూచనలు కూడా చేశాం. వెంటనే సిమ్, ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేస్తారు. దర్యాప్తుకు సులువు అవుతుంది.

* ఎవర్నైనా కించపరుస్తూ లేదా అవమానపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అలాంటి వారిపై సైబర్ బుల్లీ షీట్లు ఓపెన్ చేస్తాం.

* మహిళలు, పిల్లలను ఇబ్బంది పెడుతుంటే తన నంబర్ 9440796800 కు సమాచారం పంపవచ్చని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

* ఈకార్యక్రమంలో సైబర్ సెల్ ఎస్బీసి.ఐ ఇందిర, సి.ఐ జాకీర్ లు, తదితరులు పాల్గొన్నారు.