పుట్టపర్తి, న్యూస్ 9, అక్టోబర్ 2
శ్రీ సత్య సాయి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి గార్ల జయంతి వేడుకలు
దేశం కోసం పాటుపడిన మహాత్ముల ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం అవుదామని జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS గారు పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో పోలీసు అమర వీరుల స్థూపం వద్ద జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి గార్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ప్రేమించడం, ప్రేమను పంచడం, విశ్వాసంగా ఉండటం మహాత్మా గాంధీ గారి ఆశయాలన్నారు. ముందుగా మనం అందర్నీ ప్రేమించడం మొదలుపెడితే మనల్ని కూడా ఇతరులు ప్రేమిస్తారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులుగా మనకు ఇలా ఉండటం అవసరమన్నారు. స్వాతంత్ర్య సమరంలో ఆయన అనుసరించిన అహింసా వాదం… ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలను స్మరించుకున్నారు. స్వదేశీ విధానం, గ్రామాల అభివృద్ధి, సమైక్యతా బావాన్ని గుర్తు చేసుకున్నారు.
లాల్ బహుదూర్ శాస్త్రి గారు కూడా మహోన్నతమైన వ్యక్తి అన్నారు.