కదిరి, న్యూస్ 9,అక్టోబర్ 03:
గాండ్లపెంట మండల పరిధిలోని గుడ్డువెలగల గ్రామ సచివాలయం నందు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజలందరికీ ఆరోగ్య రక్షగా నిలుస్తున్నదన్నారు. ప్రతి పేదవారికి మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో జగనన్న మరొ అడుగు ముందుకేసి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదవారికి వరంగా మారిందో అదే విధంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యాన్ని పేదల ఇంటి వద్దకే చేరువచేసారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 1000 రూపాయల పైబడిన ప్రతి జబ్బును కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడమే కాకుండా ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే దినములకు ఆరోగ్య ఆసరా ద్వారా బృతిని అందజేయడం జరుగుతున్నదన్నారు. ఏఎన్ఎం కానీ సి హెచ్ ఓ కానీ ప్రతి ఇంటిని సందర్శించి ఆ కుటుంబ ఆరోగ్య పరిస్థితిని ముందుగానే తెలుసుకొవడం, జబ్బు పడిన వ్యక్తిని గుర్తించి నిర్దేశిత తేదీ నాడు ఆ సచివాలయం పరిధిలో నిర్వహించు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రోజు వైద్యుల చేత మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. రోగి పరిస్థితిని బట్టి వారిని ఆసుపత్రికి కూడా తరలించే వసతులు కల్పించారన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి ప్రతి పేదవారికి కార్పొరేట్ వైద్యాన్ని ఇంటి వద్దనే అందించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అందులో భాగంగా ప్రతి మండలానికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ప్రతి సచివాలయం పరిధిలో క్లినిక్ సెంటర్ ను, అర్బన్ స్థాయిలో కదిరి మున్సిపాలిటీ సంబంధించి నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి కి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, జె సి ఎస్ ఇన్చార్జులు, వివిధ శాఖల చైర్మన్ లు, డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కన్వీనర్లు, సంబంధిత అధికారులు మరియు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.