Headlines

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలి.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలి.

తనకల్లు, న్యూస్ 9, అక్టోబర్ 3

తనకల్లు లోని  గిరిజన బాలికల  వసతి గృహానికి  కాంపౌండ్ వాల్  నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి.

జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు

ఎస్సీ ,ఎస్టీ , సమస్యలు పరిష్కరించడానికి 24/7  పోలీసులు విధులు  నిర్వహిస్తారు
జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి

పుట్టపర్తి,  అక్టోబర్ 3:  తనకల్లు లోని  గిరిజన బాలికల  వసతి గృహానికి  కాంపౌండ్ వాల్  నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి  అందుకు కావలసిన నిధులు జిల్లా యంత్రాంగం సమకూర్చడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు
మంగళవారం పుట్టపర్తి కలెక్టర్ లోని  మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి  పెనుగొండసబ్ కలెక్టర్ కార్తీక్,  డిఆర్ఓ కొండయ్య తదితరులు పాల్గొన్నారు
*ఈ సందర్భంగ కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీచట్టాన్నిపకడ్బందీగాఅమలుచేయాలన్నారుఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబందించిన కేసులలో బాధితులకు న్యాయంతో పాటు పరిహారం అందించేందుకు త్వరితగతిన చర్యలు  తీసుకోవడం జరిగిందని తెలిపారుఎస్సీ ఎస్టీ చట్టంపై  ఎస్సీ ఎస్టిప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ మెంబర్ల కు సూచించారు.  శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని  సేకరించి,  భవన నిర్మాణం పనులకు   కమిటీ మెంబర్లు ఆధ్వర్యంలో  ప్రణాళికలకు సిద్ధం చేయాలని  అలాగే నా ఆధ్వర్యంలో  ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం జరుగుతుందని తెలిపారుజిల్లాలోని ప్రతి  ఎస్సీ ఎస్టీ గ్రామంలోనూ స్మశాన వాటిక ఉండేలా చూడాలని, స్మశాన వాటికల కోసం అవసరమైన భూమిని గుర్తించాలన్నారు. వారం రోజు లోపల  పక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను  ఆదేశించారు.
ప్రతినెలా ఆయా మండలాల పరిధిలో ఒక గ్రామంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు.  ఆయా సమావేశాల తేదీ వివరాలకు సంబంధించిన  జాబితాను మానిటరింగ్ కమిటీ మెంబర్లకు  తెలియజేయవలసిన బాధ్యత ఆర్డీవోలు పైన తాసిల్దారుల పైన ఉన్నదని తెలిపారు
సమావేశం దృష్టికి వచ్చిన ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెనుగొండ పట్టణంలో  ఎస్సీ ఎస్టీ ప్రజలకు సంబంధించిన స్మశాన వాటికి  స్థల సేకరణకు  రెండు రోజుల్లో పెనుగొండ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో స్థల సేకరణ కార్యక్రమం  నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 34 అట్రాసిటీ కేసుల్లో  ఎస్సీ ఎస్టీ ప్రజలకు 83 లక్షలు రూపాయలు ఆర్థికపరపతికల్పించడం జరిగిందని తెలిపారు, ఎస్సీ ,ఎస్టీ కాలనీల సమీపంలో ఎక్కడ కూడా  కలు దుకాణాలు  ఉండకుండా   చర్యలు చేపట్టడానికి  ఎక్సైజ్ అధికారులతో  గణాంకాలు తెప్పించుకుని,  చర్యలు చేపట్టడానికి  ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో , ఎస్టీలు ఎదుర్కొంఎస్సీటున్న సమస్యలను త్వరితగతిన  పరిష్కరించడానికి 24/7  పోలీస్ శాఖ విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు
. ఎస్సీ ఎస్టీల సమస్యలపై  నిరంతరం మా పోలీస్ శాఖ  కృషి చేస్తుందని తెలిపారు.  పిసిఆర్ అండ్ పి ఓ ఏ యాక్ట్ కచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు తనకలలోని గిరిజన బాలికల వసతి గృహం నందు  ప్రత్యేక మహిళ  పోలీస్ సిబ్బందిఏర్పాటుచేసి గట్టి భద్రత కల్పిస్తామని తెలిపారు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు  చేయడానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు కృషి  చేయడం జరుగుతుందని తెలిపారు
*విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో స్మశాన వాటికలు లేని గ్రామాల్లో స్మశానవాటికలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలు  ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

*ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డిడి శివరంగ ప్రసాద్, ఆర్డీఓలు భాగ్యరేఖ, తిప్పే నాయక్,  రాఘవేంద్ర, ఎస్డిపిఓల  వాసుదేవన్, శ్రీలత, వరప్రసాద్, శ్రీనివాసులు, డి.ఎస్.పి పెనుగొండ  హుస్సేన్ పీరా, డిఆర్డిఏ పీడి నరసయ్యా ,టిడబ్ల్యూఈ మోహనరాము,  ఎస్సీ, ఎస్టీ కమిటీ మెంబర్లు  వెంకటేశు, శ్రీనివాసులు, గంగులయ్య, సురేష్, శ్రీహరి, హిందూపురం తాసిల్దార్, సోమందేపల్లి తాసిల్దార్, కదిరి ఏవో , తదితరులు పాల్గొన్నారు.