చేతులు పైకెత్తి దండాలు పెడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపిన పల్లె.
పుట్టపర్తి, న్యూస్ 9, అక్టోబర్ 3
బాబు గారిని జైల్లో ఉంచి ఎన్నికల్లో గెలవాలని జగన్ కుట్రల రాజకీయాలు : మాజీ మంత్రి పల్లె.
సీఎం జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం కోసం వ్యక్తిగతంగా కక్ష సాధించాలని చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులు పెట్టి ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును అక్రమ రిమాండ్ ను నివసిస్తూ పుట్టపర్తి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప జనసేన నాయకులు పత్తి చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు.
దీక్షా శిబిరంలో నాయకులందరూ కలిసి చేతులపైకెత్తి దండాలు పెడుతూ విన్ను తన రీతిలో నిరసన తెలియజేశారు. ఓ దేవుడా జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించు అంటూ ఆ దేవుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు గారిని జైల్లో ఉంచి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి కుటిల రాజకీయాలను చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని అభాసుపాలు చేస్తున్నాడని అన్నారు.
ఈ సందర్భంగా MP నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పరిస్థితి రావడం సామాన్య ప్రజలను సైతం కలచివేసిందని జగన్మోహన్ రెడ్డి ఒక నియంతల వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని త్వరలోనే ఈ ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తెలుగుదేశం పార్టీ జనాసేన కలయిక చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు పాల్గొన్నారు.