Headlines

చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ పరిటాల శ్రీరామ్ గారు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు మద్దతుగా సంఘీభావం సామకోటి.

 

ధర్మవరం, న్యూస్ 9, అక్టోబర్ 4

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణ కేంద్రం లో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈరోజు నిర్వహిస్తున్నతువంటి 21వ రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ యంగ్ డైనమిక్ లీడర్ పరిటాల శ్రీరామ్ గారి* వారికి మద్దతుగా సంఘీభావం తెలియజేసిన శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ అనంతరం స్థానికంగా ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అక్రమ అరెస్టుతో నిర్బంధంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ నారా చంద్రబాబునాయుడు గారు ఆయనకు సంఘీభావం తెలియజేస్తూ ధర్మవరం పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని,జాతిపిత మహాత్మా గాంధీ గారు నమ్మిన సిద్ధాంతం అహింసవాదంగా చేసుకుంటూ,అన్యాయంగా జరిగే సంఘటనలకి ఎదుర్కోవడానికి సత్యాగ్రహంతో పాటు శాంతియుతంగా ఉద్యమాల ద్వారా దేశానికి స్వాతంత్రం తేవడానికి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న తీరు దేశీయంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన విషయం మనందరికీ తెలుసు అని తెలియజేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఆశయాలు గానీ,నేడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలును ఒక్కసారి మనం గమనిస్తే సంక్షేమం,అభివృద్ధి అయినప్పటికీ ప్రస్తుతం దానీతోపాటు సమాజానికి కావలసింది స్వేచ్ఛ,స్వాతంత్రయాలని అర్థమవుతున్నాయని స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో ప్రభుత్వాలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలకు సరైన పరిపాలన అందించడానికి ప్రభుత్వ శాఖలన్నీ ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ శాఖలు పనిచేసాయే తప్ప,రాజకీయ పార్టీల అవసరాల కోసం పనిచేసిన సందర్భాలు లేవని అటువంటి సందర్భాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ శాఖలు పనిచేయడం రాజ్యాంగ విరుద్ధమని,ఈ సందర్భంలో సమాజానికి స్వేచ్ఛ,స్వాతంత్ర్యం లేని ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమే కాదన్న విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి మనమంతా కృషి చేయాలని,పై విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని కాబట్టి ఈ దిశగా మనమందరం ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు యశ్వంత్,పీట్ల రమణ,రమేష్,అంజి,నరేష్,కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.