నల్లచెరువు మండలం, నడింపల్లి నందు ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి అన్న కార్యక్రమం పై కదిరి శాసనసభ్యులు,పివి సిద్ధారెడ్డి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే,మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్లే విధంగా మరో మంచి కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చారని అదే ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి. ఈ కార్యక్రమాన్ని ఈనెల 11 వ తేది నుండి నిర్వహించబడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు, జెసిఎస్ ఇంచార్జ్ లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు కార్యకర్తలు ఒకరికొకరు సమన్వయంతో జగన్మోహన్ రెడ్డి,చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో దిశా నిర్దేశం చేశారు. జగనన్న ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.